Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా హీరోలను కాదనీ ఎన్టీఆర్‌పై పొగడ్తలా?... రేణూపై పీకే ఫ్యాన్స్ ఫైర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్‌పై పీకేతో పాటు మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం లేకపోలేదు. తెలుగు చిత్రసీమలో డాన్సుల్లో మెగా హీరోల తర్వాతే ఎవరైనా అన

Advertiesment
మెగా హీరోలను కాదనీ ఎన్టీఆర్‌పై పొగడ్తలా?... రేణూపై పీకే ఫ్యాన్స్ ఫైర్
, సోమవారం, 27 నవంబరు 2017 (16:10 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్‌పై పీకేతో పాటు మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆగ్రహానికి ప్రధాన కారణం లేకపోలేదు. తెలుగు చిత్రసీమలో డాన్సుల్లో మెగా హీరోల తర్వాతే ఎవరైనా అన్నది జగమెరిగిన సత్యం. క్లిష్టతరమైన డాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ చేతులుకాళ్లు విరగ్గొట్టుకునేవారిలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ముందుంటారు. అలాగే, మిగిలిన హీరోలు కూడా డ్యాన్స్‌లో తమను తాము ప్రూవ్ చేసుకున్నారు కూడా. 
 
అయితే, రేణూ దేశాయ్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలను కాదనీ నందమూరి హీరో జూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేస్తూ ప్రశంసల వర్షం గుప్పించారు. దీంతో ఆమెపై మెగా ఫ్యాన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారట. స్టార్ ఫ్యామిలీ హీరోలను ఆమె అస్సలు పట్టించుకోవడం లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
 
నిజానికి గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ పేరు ప్రతినిత్యం వార్తల్లో వినిపిస్తోంది. తాను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రేణూ దేశాయ్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదిలావుంటే ప్రస్తుతం ఒక డాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణూ మెగా అభిమానులకు మరోసారి కోపం తెప్పించిందట. డాన్స్ షోలో జడ్జిగా ఉన్న రేణూ దేశాయ్ అందులో జూనియర్ పాటకు స్టెప్పులేసిందట. అంతటితో ఆగకుండా ఎన్టీఆర్‎పై పొగడ్తల వర్షం కురిపించిందట. 
 
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరని, నటనలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయనేనని రేణూ దేశాయ్ అన్నట్టు తెలుస్తోంది. క్లాసికల్ డ్యాన్స్‎తో పాటు వెస్ట్రన్ డాన్స్‎‎లోనూ ఎన్టీఆర్ టైమింగ్ బాగుంటుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చిందట. ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే అలాగే చూస్తుండి పోవాలనిపిస్తుంది అంటూ తారక్‎ను ఆకాశానికి ఎత్తేసింది.
 
ఈ కామెంట్సే మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించాయట. కనీసం మెగా ఫ్యామిలీ హీరోల గురించి మాట మాత్రం ప్రస్తావన తేకుండా ఎన్టీఆర్‌పై పొగడటంపై మెగా ఫ్యాన్స్ పూర్తి నిరాశకు లోనయ్యారట. మొత్తానికి పవన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా రేణూ దేశాయ్‎ను అభిమానించిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు రేణూ దేశాయ్ అంటే కస్సుమంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ త్వరలోనే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటాడు