Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపోతాసనంలో పెంగ్విన్ పక్షిలా మారిన రకుల్ ప్రీత్ సింగ్!

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (12:02 IST)
కరోనా వైరస్ ఒకందుకు చాలా మంచి చేసింది. వ్యక్తిగత శ్రద్ధ, శారీరక ఫిట్నెస్‌పై పెద్దగా ఆసక్తి లేనివారికి ఈ వైరస్ ఆసక్తి కలిగేలా చేసింది. వ్యక్తిగత పరిశుభ్రంతో పాటు ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఈ వైరస్ దరిచేదరని ఆరోగ్య నిపుణలు చెపుతూ వచ్చారు. దీంతో అనేక మంది సెలెబ్రిటీలు శారీరక వ్యాయామంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముఖ్యంగా, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్క సెలెబ్రిటీ తమతమ ఇళ్లకే పరిమితం కాగా వారందరు తమ సమయాన్ని ఎక్కువగా యోగా, వ్యాయామాల కోసం ఖర్చు చేశారని చెప్పొచ్చు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. 
 
ఈమె ఫిట్నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉంది. అందుకే తాను సినీ రంగంలో సంపాదించిన డబ్బంతా జిమ్ కేంద్రాల్లో ఖర్చు చేసింది. సొంతంగా ఓ జిమ్ సెంటర్‌ను కూడా నెలకొల్పింది. దీన్నిబట్టి ఆమెకు శారీరక ఫిట్నెస్‌పై ఎంత మక్కువో ఇట్టే తెలుసుకోవచ్చు. 
 
ఇకపోతే, తాజాగా ఆమె కపోతాసనంలో కనిపించారు. ఇది యోగాసనాల్లో ఒకటి. ఈ ఆసనాన్ని పెంగ్విన్ పక్షి ఫోజ్ ఫోటో అని కూడా అంటుంటారు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల తొడలు, గజ్జల కండరాలు బలపడతాయి. పొత్తి కడుపు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వెన్నెముక కూడా బలపడుతుందని యోగా నిపుణులు అంటున్నారు. తాను కపోతాసనం వేసిన చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

ఢిల్లీలో హైటెక్ చోరీ - అత్యాధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ 60 సెకన్లలో హైజాక్

సీఎం సిద్ధరామయ్య చేసిన పనికి మనస్తాపంతో రిజైన్ చేసిన ఏఎస్పీ

మేనమామతో ప్రేమ - షూటర్లతో భర్తను చంపించిన నవ వధువు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments