Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో వాలిపోయిన రకుల్ ప్రీత్ సింగ్!

Advertiesment
హైదరాబాద్‌లో వాలిపోయిన రకుల్ ప్రీత్ సింగ్!
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (21:23 IST)
బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ, ఎన్సీబీ విచారణకు హాజరైన టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈమె ఇపుడు హైదరాబాద్‌లో వాలిపోయింది. దీంతో టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌తో పాటు ఆ చిత్ర యూనిట్ ఖుషి అయిపోయారు. 
 
ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు శ్ర‌ద్ధా క‌పూర్, సారా అలీఖాన్, దీపికా ప‌దుకొనెను ఎన్సీబీ విచారించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వీరి ఫోన్లను సీజ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ర‌కుల్ ఈ కేసు విచార‌ణ కోసం టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ష‌న్‌లో చేస్తున్న సినిమా షూటింగ్‌కు బ్రేక్ చెప్పి ముంబైకి వెళ్లింది. 
 
దీంతో డైరెక్ట‌ర్ క్రిష్‌తోపాటు చిత్ర‌యూనిట్ కూడా కొంత నిరుత్సారం చెందారు. దీనికికారణం యువ నటుడు వైష్ణవ్ తేజ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుండగా, అందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ వికారాబాద్ అడవుల్లో సాగుతోంది. 
 
ఈ పరిస్థితుల్లో ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ తర్వాత అక్కడే ఉండకుండా హైదరాబాద్‌కు వచ్చేశారు. ఇక‌ విచారణ పేరుతో త‌న టైం వృధా చేసుకోవ‌డం ఇష్టం లేని ర‌కుల్.. వెంట‌నే మ‌ళ్లీ తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. 
 
ర‌కుల్ రాక‌తో క్రిష్ అండ్ టీం సినిమాకు సంబంధించిన కీల‌క సన్నివేశాల‌ను పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయింద‌ట‌. ఎన్సీబీ విచార‌ణ‌కు మ‌ళ్లీ హాజ‌రయ్యే ప‌రిస్థితులు వ‌చ్చే అవ‌‌కాశ‌ముండ‌టంతో ర‌కుల్ వెంట‌నే షూటింగ్‌లో జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తోంది. 
 
40 రోజుల సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాల‌నుకున్న క్రిష్.. ఒక‌వేళ ర‌కుల్ స‌మ‌యానుగుణంగా షూట్‌కు హాజ‌రైతే అనుకున్న టైంకే సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తాడ‌నంలో ఎలాంటి సందేహం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో భారీ చిత్రం, అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్..!