Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రకుల్ కొంపముంచిన రియాతో స్నేహం.. అరెస్టు తప్పదా?

Advertiesment
Rakul Preet Singh
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:01 IST)
బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహంవుంది. ముంబై వెళ్లినప్పుడల్లా రియాతోనే రకుల్ కలిసి తిరిగేదని, ఆమెతో కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్లేది. ఇపుడు ఈ స్నేహమే ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్‌ను చిక్కుల్లో పడేలా చేసింది. 
 
రియా చక్రవర్తి సేకరించిన మాదకద్రవ్యాలను రకుల్ ఇంట్లో దాచిపెడుతూ వచ్చింది. ఇదే ఇపుడు రకుల్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్‌ను నిల్వచేసినట్టు నిరూపితమైతే రకుల్ ప్రీత్ సింగ్ అరెస్టు తప్పదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించింది. ముఖ్యంగా, రకుల్ ప్రీత్ సింగ్ వద్ద జరిపిన విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఎన్సీబీ అడిగిన ప్రశ్నలకు రకుల్ సమాధానమిస్తూ, తానెప్పుడూ డ్రగ్స్ సేవించలేదని, డ్రగ్ చాట్ మాత్రం చేశానని రకుల్ అంగీకరించిందట. అలాగే  రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు, రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందట. రకుల్ నిజంగా ఈ విషయం అంగీకరించినట్టైతే ఆమె అరెస్టు తప్పదని ప్రముఖ న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్‌ను దాచడం పెద్ద నేరమని వారు అభిప్రాయపడుతున్నారు. పైన పేర్కొన్నట్టు రకుల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం నిజమైతే ఆమె అరెస్టు తప్పదని ఆయన తెలిపారు. డ్రగ్స్ వాడడం కంటే ఇది పెద్ద నేరమని పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారి నుంచి బయటపడిన మెగా బ్రదర్