Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-3లో వెంకటేష్ లేడా..? మర్యాద రామన్నకు ఛాన్స్?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:49 IST)
ఎఫ్-3 సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. వెంకటేష్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అనిల్ రావిపూడి ప్రకటించాడు. 
 
లాక్‌డౌన్ టైమ్‌లో స్క్రిప్టు పనులు కూడా జరిగాయి. కానీ ఎఫ్-2లో నటించిన వరుణ్ తేజ్, వెంకటేష్.. ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఎఫ్ 3 ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనబడట్లేదు. అందువల్ల అనిల్ రావిపూడి, మరో కొత్త కథని తెరమీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఐతే అటు కొత్త సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఎఫ్ 3 సినిమాలో మరో హీరో కోసం వెతుకుతున్నాడట. 
 
తాజా సమాచారం ప్రకారం సునీల్‌ని ఎఫ్-3లో నటింపజేయాలని అనుకుంటున్నాడట. కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్, హీరోగా మారి విఫలమయ్యాక మళ్లీ కమెడియన్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడవ హీరోగా సునీల్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments