Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తాం.. రజనీకి షాకిచ్చిన అభిమాన సంఘాలు

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (12:28 IST)
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దిమ్మ దిరిగే షాక్‌ ఇచ్చాయి ఆయన అభిమాన సంఘాలు. రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేయబోతున్నారు. చాలాకాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు.
 
అయితే.. ఈరోజు ఉదయం అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు రజినీకాంత్‌. ఈ సమావేశంలో రజినీకాంత్‌ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. 
 
''మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తాం"అని తేల్చి చెప్పేశారు అభిమాన సంఘాల నేతలు. బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడువలేమంటూ స్పష్టం చేశాయి అభిమాన సంఘాలు. అభిమాన సంఘాల తీరుతో షాక్‌ తిన్న రజినీకాంత్‌.. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. దీంతో మళ్లీ తన రాజకీయ ప్రకటనను వాయదా వేసే అవకాశం వుంది. జనవరిలోనే రజనీకాంత్ కొత్త పార్టీపై ప్రకటన చేసే ఛాన్సుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments