ఎల్జీ నుంచి ఇప్పటికే రోలింగ్ మొబైల్స్ వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా ఈ మొబైల్స్ ఉండనున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. అది కూడా ఎల్‌జీ నుంచే. ఈ మేరకు పేటెంట్ ఇమేజెస్ కొన్ని ఆన్‌లైన్ చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్, మోటోరోలా, హువావే ఇప్పటికే ఫోల్డింగ్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేశాయి.
ఎల్‌జీ త్వరలోనే 17-అంగుళాల రోలింగ్ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్ తీసుకురానుందట. ఈ మేరకు రూట్ మై గెలాక్సీ పేరుతో రోలింగ్ ల్యాప్‌టాప్ డిజైన్‌కు సంబంధించిన హక్కులను ఇటీవలే పొందినట్లు టెక్ వర్గాలు తెలిపాయి. రోలింగ్ ల్యాప్‌టాప్ డిస్‌ప్లేని 13.3 అంగుళాల నుంచి 17 అంగుళాల సైజు వరకు ఉపయోగించుకోవచ్చు.
అలానే ల్యాప్‌టాప్ కీబోర్డు కూడా మడతపెట్టేయొచ్చు. ఇప్పటికే ఎల్‌జీ వింగ్, జీ8 ఎక్స్ థింక్యూ పేరుతో డ్యూయల్ స్క్రీన్ మొబైల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలోనే దీనిపై ఎల్‌జీ నుంచి రోలింగ్ ల్యాప్‌టాప్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.