Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేజ‌ర్ లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు

Advertiesment
మేజ‌ర్ లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు
, శుక్రవారం, 27 నవంబరు 2020 (22:42 IST)
క్ష‌ణం, గూఢచారి, ఎవ‌రు వంటి  సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా `గూఢ‌చారి` ఫేం శ‌శి కిర‌ణ్‌ తిక్కా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
 
అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్  ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్స్ సినిమాపై ఆసక్తిని రేపాయి. కాగా ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు మేజ‌ర్‌లుక్ టెస్ట్ వీడియోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు విడుద‌ల‌ చేశారు. ఈ వీడియోలో  'మేజర్' సినిమా ఎలా మొదలైంది.. లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాల‌ను అడివిశేష్
వెల్లడించారు.
 
అడవి శేష్ మాట్లాడుతూ.. ''మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ 2008 నుంచి నా మైండ్‌లో ఉన్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు నేను యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను. అక్కడ న్యూస్ ఛానల్స్‌లో 27వ తారీకు మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు. అప్పుడు సడెన్‌గా ఆయన్ని చూసి ఎవ‌రు ఆయ‌న‌ అనుకున్నాను. చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్యలా అనిపించారు.
 
ముఖ్యంగా ఆయన కళ్ళలో ఒక ప్యాష‌న్‌, స్పిరిట్ ఉంది. దాంతో ఆయ‌న ఎవ‌రు అని తెలుసుకోవాల‌ని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అందుకే ఆయనపై వచ్చిన ప్రతీ న్యూస్‌ను కట్ చేసి పెట్టుకున్నాను. ఇంటర్వూస్ కంప్యూటర్లో సేవ్ చేసుకుని చూసుకుంటూ ఉండే వాడిని. దాంతోనే పదేళ్లు గడిచింది. ఈ ప‌దేళ్లలో ఇండస్ట్రీలోకి రావ‌డం జ‌రిగింది. ఆయ‌న లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాని ఆయ‌న పేరెంట్స్‌ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడూ రాలేదు. అయితే ఫైన‌ల్‌గా 'మేజర్' లాంటి పాన్ ఇండియన్ స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఉన్ని కృష్ణ‌న్ సందీప్ వాళ్ల ఫాద‌ర్‌ని కాంటాక్ట్ చేశాను.
 
పదేళ్లుగా నా కొడుకు లైఫ్‌ని రీసెర్చ్ చేస్తున్నారా? నా కొడుకు లైఫ్‌ని ఇన్స్‌ఫైర్ అయ్యి ఒక సినిమా తీయాల‌నుకుంటున్నాడా? అని ఆయ‌న నమ్మలేదు. ఆ త‌ర్వాత బెంగుళూరులో సందీప్ పేరెంట్స్‌ని క‌లిసి వారితో కొన్ని రోజులు గ‌డిపాను. ఆ స‌మ‌యంతో సందీప్ గురించి కొన్ని విష‌యాలు చెప్పారు. అలాగే రెండు మూడు సార్లు క‌లిసి వారితో మాట్లాడిన ‌తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని 10 శాతం నమ్ముతున్నాం అన్నారు.
 
0-10% వ‌చ్చామ‌ని ఆనంద‌ప‌డాలా? లేక ఇంకా 10%లోనే ఉన్నాం అని భాద‌ప‌డాలా? అర్ధం కాలేదు. కాని అప్పుడే ఈ సినిమా కచ్చితంగా చేయాలని మొండిపట్టు పట్టాను. సందీప్ పేరెంట్స్‌ని క‌లిసిన‌ప్పుడు వాళ్లు చెప్పిన ఫ‌స్ట్ విష‌యం ఏంటంటే మేజర్ సందీప్ గారి ఐకానిక్ పాస్‌పోర్ట్ ఫోటో. ఆయ‌న నవ్వు ఆపుకుంటూ ఫోటో దిగారట. అయినా ఆయ‌న ఆ కళ్ళలో ఉన్న స్పిరిట్ మాత్రం షైన్ అయ్యింది అదే ఇన్నేళ్ళుగా న‌న్ను  ట్రావెల్ అయ్యేలా చేసింది.
 
ఒక సంద‌ర్భంలో సందీప్ అమ్మగారు నన్ను చూసి మా సందీప్ లానే క‌నిపిస్తున్నావు  అన్నారు. ఆ క్ష‌ణం నాకు అర్ధ‌మైంది మేజ‌ర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయ‌డానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చింద‌ని. ఆ తర్వాత గ్రాండ్‌గా ఈ సినిమా తీయాలని నిర్మించుకున్నాను. నా ఫ్రెండ్స్ అనురాగ్ శ‌ర‌త్ టీమ్‌తో మాట్లాడి అలాగే మహేష్ బాబు గారు మరియు సోని పిక్చర్స్ సహకారంతో తెలుగు, హిందీ భాష‌ల‌లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం.
 
ఆయ‌న లైఫ్ స్టోరి చెప్పాల‌నే ఉద్దేశ్యంతో గూఢ‌చారి డైరెక్ట‌ర్ శ‌శి కిర‌ణ్‌ని తీసుకొచ్చి ఆయ‌న‌తో డైరెక్ట్ చేయించ‌డం జ‌రిగింది. ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాస‌ఫి గుర్తొచ్చింది.
'మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం.. ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ.. ఇవి రెండూ మేజర్ సందీప్ లక్షణాలు. ఇవి రెండూ నమ్ముకుంటే చాలు' అని లుక్ టెస్ట్‌కి వెళ్లి  ఆయ‌న స్పిరిట్‌ని నాలో నేను వెతుక్కుని మేజర్ సందీప్‌గా ఓ ఫోటో దిగా .. అంటూ ఒక  ఫోటోని రివీల్ చేశాడు అడివిశేష్.
 
అందులో మేజర్ సందీప్ హాఫ్ పేస్‌కి మేజర్ రోల్ చేస్తున్న శేష్ హాఫ్ ఫేస్‌ను అతికించి ఆసక్తికరంగా చూపించారు. దీనికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫోటోను ఎలివేట్ చేసే విధంగా ఉంది. 'మేజర్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిసెంబర్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అడివి శేష్‌, శోభితా దూళిపాళ్ల, సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి బేన‌ర్స్‌: జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్, ద‌ర్శ‌క‌త్వం: శ‌శి కిర‌ణ్ తిక్కా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాహ్నవి దాసెట్టికి కరోనా? మహాతల్లి ఏం చెప్పిందంటే?