Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

దేవీ
సోమవారం, 16 జూన్ 2025 (18:02 IST)
Pedarayudu cake cutting mohanbabu
రజనీకాంత్, మోహన్ బాబు స్నేహితులు. నిన్న ప్రత్యేకంగా కన్నప్ప సినిమాను రజనీకాంత్ కు మంచు మోహన్ బాబు చూపించారు. ఈ సందర్భంగా నేడు ఫొటోలను విడుదలచేస్తూ, జూన్ 15న, పెదరాయుడు థియేటర్లలో విడుదలై 30 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదే రోజున, నా ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి కన్నప్ప చిత్రాన్ని చూశాడు.
 
సినిమా తర్వాత ఆయన ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత, ప్రోత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదాలు, మిత్రమా అంటూ సోషల్ మీడియాలో మోహన్ బాబు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించారు. ఆయనతోపాటు మంచు విష్ణు కూడా వున్నారు. 
 
Rajinikanth, Mohan Babu, Vishnu
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక శనివారం నాడు కొచ్చిలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
 
మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మెహన్ బాబు గారికి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments