Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధేశ్యామ్ క్ల‌యిమాక్స్ హైలైట్‌- ప్ర‌భాస్‌

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (22:26 IST)
Krishnam raju, prabhas, naveen
ఫిలింసిటీలో గురువారం రాత్రి రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. అభిమానుల స‌మ‌క్షంలో పాటు దేశంలో ఐదు భాష‌ల మీడియా హాజ‌రైంది.  ప్ర‌భాస్ మాట్లాడుతూ, డార్లింగ్ ఐల‌వ్ యూ అంటూ సంబోధించారు.ట్రైల‌ర్ బాగా న‌చ్చింద‌నుకుంటున్నా. పెద్ద‌నాన్న‌గారు చిన్న‌సైజు దేవుడులా వున్నారు. గోపీకృష్ణ మూవీస్ లో మ‌న‌ ఊరి పాండ‌వులు, తాండ్ర‌పాపారాయుడు వంటి గొప్ప సినిమాలు తీశారు. ఆ త‌ర్వాత బిల్లా తీశాం. ఇప్పుడు రాధేశ్యామ్ చేశాం. ఇది ల‌వ్ స్టోరీ లాంటిదే. ద‌ర్శ‌క నిర్మాత‌లు కోవిడ్ టైంలో చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. జార్జియా, ఇట‌లీ, హైద‌రాబాద్ ఇలా అన్ని చోట్ల రెండేళ్ళ‌పాటు క‌ష్ట‌ప‌డ్డారు. 
 
- స‌త్య‌రాజ్‌, పెద్ద నాన్న‌, జ‌య‌రాం, సచిన్‌, భాగ్య‌శ్రీ‌కి ధ‌న్య‌వాదాలు. కెమెరామెన్ మ‌నోజ్ అందంగా చూపించాడు. జ‌గ‌ప‌తిబాబు గెస్ట్‌గా చేశారు. పూజా కూడా అందంగా వుంది. ఈ ఈవెంట్‌కు పోలీసులు చాలా స‌హ‌క‌రించారు.
 
- ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఐదేళ్ళు ఈ సినిమాపై దృష్టి సారించారు. బాహుబ‌లి అయ్యాక‌ సాహో త‌ర్వాత ఈ సినిమా మొద‌లు పెట్టాం. కొద్దిరోజుల చేశాక ఆపి, మ‌ర‌లా చేసి, మ‌ర‌లా ఆపి.. ఇలా చికాకు పుట్టినా ఓపిక‌గా సినిమా పూర్తి చేశాం. ఈ సినిమాలో చాలా మ‌లుపులు వున్నాయి. క్ల‌యిమాక్స్ హైలైట్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. జ‌న‌వ‌రి 14న చూడండ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments