Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ ఇదే

Advertiesment
పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ ఇదే
, సోమవారం, 20 డిశెంబరు 2021 (20:31 IST)
Krishnam Raju
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను మరో అప్ డేట్ బయటికి వచ్చింది. రాధే శ్యామ్ సినిమా నుంచి లెజెండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు పోషిస్తున్న పరమహంస లుక్ విడుదలైంది. ఆధ్యాత్మికంగా ఉన్న ఆయన లుక్‌కు మంచి స్పందన వస్తుంది. 
 
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 23న ఆర్ఎఫ్‌సీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు.
 
ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బికినీలో పూజా హెగ్డె, కుక్కతో సమంత