Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమానుల కోసం ప్ర‌భాస్ ఏం చేస్తున్నాడో తెలుసా

Advertiesment
అభిమానుల కోసం ప్ర‌భాస్ ఏం చేస్తున్నాడో తెలుసా
, శనివారం, 18 డిశెంబరు 2021 (08:14 IST)
Prabhas, Pooja Hegde
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. 
 
ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది.
 
- తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. 
 
- అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులో అంతఃపురంగా వస్తున్న ఆర్య, రాశీ ఖన్నాల అరణ్మణై 3