పవన్ కళ్యాణ్ అంటేనే పైర్. పవర్ స్టార్. ఆన్ లైన్ టిక్కెట్లు, టిక్కట్ రేటు పెంపు తదితర అంశాలపై ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. అభిమానులు ఫిదా అయ్యారు. ఏకంగా ఎ.పి. ప్రభుత్వాన్ని అక్కడి మంత్రుల్ని తూటాలాంటి మాటలతో దాడి చేశారు. ఇండస్ట్రీ బాగుకోసం అంతలా మాట్లాడినా పవన్ చెప్పింది కరెక్టే అన్న వారు లేరు. ఆ తర్వాత కొందరు అగ్ర నిర్మాతలు వపన్ కరెక్ట్‌గా చెప్పారని వ్యక్తిగతంగా కలిసిన వారితో అన్నారు మినహా బాహాటంగా మాట్లాడిన సందర్భాలు లేవు.
ఆ తర్వాత ఎ.పి. ప్రభుత్వం టిక్కట్లపై జీ.ఓ. అమలు చేస్తామని ఖరాఖండిగా చెప్పినా అయ్యా బాబూ.. కాస్త కనికరించండి అంటూ నిర్మాతలు ప్రాదేశయపడుతున్నారు. ఇదే పవన్‌కు నచ్చలేదు.
ఇదిలా వుండగా, సంక్రాంతి బరిలో మొదటినుంచి పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్ వస్తుందని ప్రచారం కూడా చేశారు. కానీ ఫైనల్‌గా ఆయన సినిమాకే చెక్ పడింది. వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆర్.ఆర్.ఆర్., రాధేశ్యామ్‌లు రెండే బరిలో వుంటున్నాయి. ఈ సందర్భంగా రాజమౌళి.. వెనక్కు తగ్గిన సినిమాల వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడ మహేష్‌బాబు మా హీరో అంటూ సంబోధిస్తూ ఆయన ధన్యవాదాలు చెప్పాడు. అంటే భవిష్యత్‌లో మహేష్‌తో రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి అలా చెప్పాడని నెటిజన్లు అనుకుంటున్నారు.
కానీ అదే విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు ఎందుకు చెప్పలేదని వారు ఆగ్రహంతో వున్నారు. వ్యక్తిగతంగా పవన్‌కు చెప్పాడేమోనని కొందరంటే మరి మహేష్‌బాబు విషయం ఎందుకు ట్వీట్ చేశాడు. అలాగే ఇతర సినిమా నిర్మాతలకు ఎందుకు ట్వీట్ చేశాడని విషయాన్ని వారు నిలదీస్తున్నారు. ఈ విషయంలో పవన్ అభిమానులు రాజమౌళిపై గుర్రుగా వున్నారు. సినిమారంగంలో ఏదైనా సమస్య వస్తే వపన్ ముందుంటే చివరికి ఆయన సినిమానే వాయిదా వేసుకునేలా చేశారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.