Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు తెరలపై ప్రేమ : "రాధేశ్యామ్" నుంచి ఆసక్తికర పోస్ట్ (Video)

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (14:02 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నార. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ చిత్రం నుంచి మరో ఆకర్షణీయమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీన్ని చూస్తే ప్రభాస్ లవర్ బాయ్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ప్రభాస్ ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’ వంటి చిత్రాల్లో లవర్‌బాయ్‌ పాత్రలో నటించిన విషయం తెల్సిందే. 
 
ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌ లవర్‌బాయ్‌గా సాఫ్ట్‌ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. 
 
దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజు శివ‌రాత్రి సంద‌ర్భంగా మూవీ నుండి ఆస‌క్తికర పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments