చెర్రీ - శంకర్ కాంబో చిత్రానికి సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహ్మాన్!

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (13:08 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే, ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నకు రెహమాన్‌ ఇచ్చిన సమాధానం చూస్తే అవుననే అనిపిస్తోంది. ట్విటర్‌లో ఒక అభిమాని రెహమాన్‌ని ప్రశ్నిస్తూ ‘మీ నుంచి తెలుగు ఆల్బమ్‌ ఎప్పుడు వస్తుంది’ అని అడిగారు. అందుకు ‘త్వరలోనే’అని సమాధానమిచ్చిన రెహమాన్‌ స్మైలీ సింబల్‌ పోస్ట్‌ చేశారు.
 
ఇప్పుడీ ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మామూలుగా శంకర్‌ డైరెక్ట్‌ చేసే చాలా చిత్రాలకు ఏఆర్‌ రెహమానే సంగీతం అందిస్తారు. ఇప్పుడీ ఈ సమాధానంతో శంకర్‌-చెర్రీల సినిమాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని టాక్‌ వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. 
 
ఒకవేళ ఆయన్నే చిత్రబృందం నిర్ణయిస్తే రెహ్మా ప్రపంచ స్థాయి సంగీతంకు శంకర్‌ టేకింగ్‌కు రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ యాక్టింగ్‌‌తోడైతే వెండితెరపై పండగ వాతావరణమే. ప్రస్తుంత ఈ చిత్రానికి సంబంధిచంన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా 2022లో ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments