Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమించిందని యువతి జుట్టు కత్తిరించారు, 135 సార్లు ప్రేమికుడు ఫోన్, తట్టుకోలేక సూసైడ్

Advertiesment
ప్రేమించిందని యువతి జుట్టు కత్తిరించారు, 135 సార్లు ప్రేమికుడు ఫోన్, తట్టుకోలేక సూసైడ్
, బుధవారం, 10 మార్చి 2021 (13:57 IST)
ప్రేమంటే అంతేనని చాలా సందర్భాల్లో తెలుస్తున్న విషయం. అంతేనంటే... పెద్దలు ఏమాత్రం అంగీకరించరని. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. తమ కుమార్తె ప్రేమలో పడిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆ యువతిని కాలేజీ మాన్పించడమే కాకుండా ఆమె జుట్టు కత్తిరించేశారు. దీనితో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
 
పూర్తి వివరాలను చూస్తే... ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పరమేశ్వర్ సుమారు 20 ఏళ్ల కిందట నగరంలోని లక్ష్మీగూడలో సెటిల్ అయ్యాడు. ఈయనకు నలుగురు సంతానం కాగా చిన్న కుమార్తె లీజా ఇంటర్ చదువుతోంది. లీజా రోజూ కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో ఆమె ఇంటికి సమీపంలో వున్న అప్సర్ పరిచయమయ్యాడు. అతడు కూడా ఆమె చదువుతున్న కాలేజీలోనే చదువుతున్నాడు. దీనితో ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమలో పడ్డారు.
 
విషయం పెద్దల వరకూ వెళ్లడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పరమేశ్వర్ కుమార్తె చదువు మాన్పించేశాడు. అంతేకాకుండా... ఆమె బయట తిరగకుండా చేసేందుకు ఆమె జుట్టు కత్తిరించేశాడు. దీనితో ఆమె తన గదికే పరిమితమైపోయింది.
 
కానీ ఆమె ప్రియుడు అప్సర్ మాత్రం ఆమెకి నిత్యం ఫోన్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. తనను ప్రశాంతంగా వుండనీయమన్నప్పటికీ ఆమెకు నిత్యం ఫోన్ చేస్తూనే వున్నాడు. అతడితో దాదాపు గంటసేపు మాట్లాడి తన సమస్యను చెప్పుకున్నప్పటికీ అతడు ఆమెను వదల్లేదు. ఒకవైపు తల్లిదండ్రులు, ఇంకోవైపు ప్రియుడు మానసిక క్షోభకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ప్రియుడు అప్సర్ ఆమె ఫోన్ నెంబరుకి 135 సార్లు ఫోన్ చేసాడు. కాగా ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఫోన్‍ 12 స్మార్ట్‌ఫోన్‌.. 5జీ టెక్నాలజీతో వచ్చేస్తోంది..