Webdunia - Bharat's app for daily news and videos

Install App

త‌న‌పై వున్న విమ‌ర్శ‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోయిన ప్ర‌కాష్‌రాజ్‌

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (20:32 IST)
Prakash raj
`మా` ఎన్నిక‌లు ర‌స‌ప‌ట్టులో వున్నాయి. మూడునెల‌ల క్రిత‌మే ప్ర‌కాష్‌రాజ్ మెగాస్టార్ చిరంజీవిని క‌లిసి తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ త‌ర‌ఫు అధ్య‌క్షుడిగా పోటీ చేస్తున్నాన‌ని తెలియ‌జేశాడు. అందుకు ఆయ‌న స‌పోర్ట్ కూడా వుంది. అందుకే స్లోగ‌న్ కూడా ఆక‌ట్టుకునే పెట్టాడు. 
 
ప్రకాష్ రాజ్ సిని'మా' బిడ్డల ప్యానెల్ 
సిని'మా' బిడ్డ‌లం
మ‌న‌కోసం మ‌నం
'మా' కోసం మ‌నం.. అంటూ కాప్ట‌న్‌లు పెట్టి అంద‌రినీ క‌లుపుకొనేరీతిలో వున్నాడు. ఇప్పుడు అదే ఆయ‌న‌కు ప్ర‌ధాన చిక్కు తెచ్చిపెట్టింది. ప్ర‌కాష్‌రాజ్ తీరుపై గ‌తంలో ప‌లుసార్లు ఫిలింఛాంబ‌ర్‌లో నిర్మాత‌లు, `మా` అసోసియేష‌న్‌లో ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఫిర్యాదు చేశారు. షూటింగ్ వుంటే స‌రిగ్గారాడ‌నీ, చివ‌రి నిముషంలో కాన్సిల్ చేస్తాడ‌ని అప‌వాదు గ‌ట్టిగా వుంది. అందుకు ఆయ‌న సంజాయిషీలు, ఫైన్‌లు కూడా క‌ట్టిన సంద‌ర్భాలు వున్నాయి. ఇప్పుడు ఇవే పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. ఈ విష‌యాన్ని ఓ విలేక‌రి అడుగుతూ, దీనికి ఏమి స‌మాధానం చెబుతారు. మీరు అధ్య‌క్షుడిగా నిల‌బడేట‌ప్పుడు ఇవ‌న్నీ ఆలోచించ‌లేదా? అంటూ ప్ర‌శ్నించారు.
 
అందుకు ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడుతూ, నాకు వ్య‌క్తిగ‌తంగా కొన్ని ప‌నులుంటాయి. నేను బిజీ, భార్య‌, పిల్ల‌లు, వ్య‌క్తిగ‌త ప‌నులు ఇలా చాలా ప‌నుల‌తో బిజీగా వున్న‌ప్పుడు అన్నిటినీ చూసుకోవాలి. అంటూ అస‌లు విష‌యం చెప్ప‌కుండా స‌మాధానం ముగించారు. దీనితో ఇష్యూను ఇంకా ఎక్కువ చేయ‌డం త‌గ‌ద‌ని భావించిన ఇత‌ర సీనియ‌ర్ స‌భ్యులు ఆ విష‌యాన్ని అంత‌టితో ముగించారు. ఇప్ప‌టికే ప్ర‌కాష్‌రాజ్‌ను బెంగుళూరు, చెన్నైల‌లో ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే ఓడించారు. అందుకే హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని టాక్ ప్ర‌బ‌లంగా వ‌నిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments