Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌కాష్‌రాజ్‌ను చూసి నేర్చుకోమంటున్నారుః బండ్ల గ‌ణేష్‌

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (20:16 IST)
Bandla ganesh-raj
`మా` ఎన్నిక‌లు ఎప్ప‌డు జ‌రిగినా ఇప్పుడు అది పెద్ద ర‌చ్చ అవుతోంది. గ‌త ఆరేగేళ్ళుగా ఇదే తంతు. ఇప్పుడు మ‌రీ ఎక్కువైంది. కార‌ణం నాన్ లోక‌ల్ ప్ర‌కాష్‌రాజ్ మా అధ్య‌క్షుడిగా నిల‌బ‌డ‌డ‌మే. మ‌రి ఆయ‌న పేన‌ల్‌లో బండ్ల‌గ‌ణేష్ వున్నాడు. శుక్ర‌వారం జ‌రిగిన ప్రెస్‌మీట్ బండ్ల‌గ‌ణేష్ మాట్లాడుతూ, నేను మాట్లాడితే బీపీ వ‌స్తుంది. ఆ బీపీ వ‌స్తే వేరేలా వుంటుంది. క‌నుక అంద‌రూ క‌లిసి వుండాల‌ని ప్ర‌కాష్‌రాజ్‌కు మ‌ద్ద‌తు తెలిపాం అన్నాడు.
 
నాన్ లోక‌ల్ గురించి మాట్లాడుతూ,  ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇప్పుడు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్నాడని అలాగే ఇక్కడే పుట్టిన రాజమౌళిని హాలీవుడ్ సినిమాలు చెయ్యమని అడుగుతున్నారు. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏమిటి అని బండ్ల గణేష్ త‌న‌శైలిలో చెప్పాడు. పైగా ప్ర‌కాష్‌రాజ్ మా ఏరియాలోనే గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు. అక్క‌డే ఆయ‌న ఫామ్ హౌస్ వుంది. అది కూడా నేనే అమ్మాను. ఇప్పుడు వ్య‌సాయం చేస్తూ అక్క‌డ ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు. మా గ్రామంలోనివారంతా ఆయ‌న్ను చూసి నేర్చుకోండ‌ని చెబుతుంటే నాకే స్పూర్తిగా అనిపించింది.

అలాంటి వాడిని నాన్ లోకల్ అంటారా! అంటూ వ్యాఖ్యానించారు. మ‌రి ఇదేమాట మీద చివ‌రి వ‌ర‌కు వుంటాడా! అంటూ ఆయ‌న మాట్లాడుతుండ‌గానే అక్క‌డివారు సెటైర్ వేశారు. ద‌టీజ్ బండ్ల గ‌ణేష్‌. మ‌రి ఆయ‌న మాట‌లు వినేవారికి ఎంట‌ర్‌టైన్ చేయించాయి. అందుకే అక్క‌డే వున్న నాగ‌బాబుకూడా తెగ న‌వ్వుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

'సురవరం'కు సీఎం చంద్రబాబు నివాళులు - పోరాట వారసత్వం ఇచ్చి వెళ్లారు...

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments