`మా` ఎన్నికలు ఎప్పడు జరిగినా ఇప్పుడు అది పెద్ద రచ్చ అవుతోంది. గత ఆరేగేళ్ళుగా ఇదే తంతు. ఇప్పుడు మరీ ఎక్కువైంది. కారణం నాన్ లోకల్ ప్రకాష్‌రాజ్ మా అధ్యక్షుడిగా నిలబడడమే. మరి ఆయన పేనల్‌లో బండ్లగణేష్ వున్నాడు. శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్ బండ్లగణేష్ మాట్లాడుతూ, నేను మాట్లాడితే బీపీ వస్తుంది. ఆ బీపీ వస్తే వేరేలా వుంటుంది. కనుక అందరూ కలిసి వుండాలని ప్రకాష్‌రాజ్‌కు మద్దతు తెలిపాం అన్నాడు.
నాన్ లోకల్ గురించి మాట్లాడుతూ, ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇప్పుడు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్నాడని అలాగే ఇక్కడే పుట్టిన రాజమౌళిని హాలీవుడ్ సినిమాలు చెయ్యమని అడుగుతున్నారు. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏమిటి అని బండ్ల గణేష్ తనశైలిలో చెప్పాడు. పైగా ప్రకాష్‌రాజ్ మా ఏరియాలోనే గ్రామాలను దత్తత తీసుకున్నాడు. అక్కడే ఆయన ఫామ్ హౌస్ వుంది. అది కూడా నేనే అమ్మాను. ఇప్పుడు వ్యసాయం చేస్తూ అక్కడ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. మా గ్రామంలోనివారంతా ఆయన్ను చూసి నేర్చుకోండని చెబుతుంటే నాకే స్పూర్తిగా అనిపించింది.
అలాంటి వాడిని నాన్ లోకల్ అంటారా! అంటూ వ్యాఖ్యానించారు. మరి ఇదేమాట మీద చివరి వరకు వుంటాడా! అంటూ ఆయన మాట్లాడుతుండగానే అక్కడివారు సెటైర్ వేశారు. దటీజ్ బండ్ల గణేష్. మరి ఆయన మాటలు వినేవారికి ఎంటర్‌టైన్ చేయించాయి. అందుకే అక్కడే వున్న నాగబాబుకూడా తెగ నవ్వుకున్నాడు.