Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శ్రీదేవి సోడా సెంటర్'కు ప్రభాస్ మద్దతు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:13 IST)
'శ్రీదేవి సోడా సెంటర్' కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమాను విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే అగ్ర కథానాయకులు పాలు పంచుకోగా. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం తనవంతు సాయం అందించాడు. 
 
ఈ సినిమా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌ను ప్రభాస్ ఇంటర్వ్యూ చేసి మూవీ విశేషాలను వారి నుండి రాబట్టాడు. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వూ బుధవారం రానుంది. సహజంగా మీడియా ముందుకు రావడానికి మొహమాటపడే ప్రభాస్. 
 
ఇటీవలే ఇతర చిత్రాలను ప్రమోట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రభాస్ ఏ చిత్రాన్ని అయినా ప్రమోట్ చేస్తే.. ఆ బజ్ వేరే లెవెల్ లో ఉంటుందని ఆ మధ్య 'జాతిరత్నాలు' సినిమా నిరూపించింది. అదే మ్యాజిక్ రేపు 'శ్రీదేవి సోడా సెంటర్' మూవీ విషయంలోనూ జరగొచ్చు.
 
మూవీ రన్ టైమ్ లాక్డ్!
తాజాగా 'శ్రీదేవి సోడాసెంటర్' మూవీ సెన్సార్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. కట్స్ ఏమీ లేకుండానే మూవీకి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారని, రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేశామని చిత్ర యూనిట్ తెలిపింది.
 
మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు ఇప్పటికే సోషల్ మీడియా రచ్చ చేస్తున్నాయి. ఆగస్ట్ 26న ఈ సినిమా ప్రీమియర్ షోస్ యు.కె. లో పడబోతున్నాయి. 
 
'వి' మూవీ గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఓటీటీలో విడుదలైంది. ఈ యేడాది జనవరిలో దానిని థియేటర్లలో రిలీజ్ చేశారు. దాని తర్వాత వస్తున్న సుధీర్ బాబు మూవీ ఇదే కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments