Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ‘గల్లీరౌడీ’ డేట్‌ను ప్ర‌క‌టిస్తాం:కోన వెంక‌ట్‌, స‌త్య‌నారాయ‌ణ‌

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:54 IST)
Gallirody
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గ‌ల్లీరౌడీ సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల కావ‌డం లేదు. 
 
దీని గురించి  మేక‌ర్స్ మాట్లాడుతూ ‘‘మా గల్లీరౌడీ’ని ముందుగా సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే ఆరోజున బాక్సాఫీస్ వ‌ద్ద ఇత‌ర సినిమాలు కూడా ఎక్కువ‌గా పోటీప‌డుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్టి, ఇప్పుడిప్పుడే ప్రేక్ష‌కులు సినిమా థియేటర్స్‌కు ధైర్యంగా వ‌చ్చి సినిమాల‌ను ఆద‌రిస్తున్న త‌రుణంలో, మంచి రిలీజ్ డేట్ కోసం ఆగితే మంచిద‌నే అభిప్రాయం క‌లిగింది. ఫ్రెండ్లీ ఎట్మాస్పియ‌ర్ అంద‌రి మ‌ధ్య ఉండాల‌ని భావించాం. అందువ‌ల్ల మా సినిమాను ఇంత‌కు ముందు ప్ర‌క‌టించిన‌ట్లు సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌డం లేదు. సెప్టెంబ‌ర్‌లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామ‌ని, త్వ‌ర‌లోనే ఆ రిలీజ్ డేట్‌ ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments