Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో "వివాహ భోజనంబు" స్ట్రీమింగ్

Advertiesment
Sony Live OTT
, గురువారం, 19 ఆగస్టు 2021 (19:15 IST)
Vivaha bhojanambu
కమెడియన్ సత్య హీరోగా నటించిన "వివాహ భోజనంబు" సినిమా 'సోని లివ్' ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్టు 27 న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన "వివాహ భోజనంబు" సినిమాను వాస్తవ ఘటనల స్ఫూర్తితో  రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా.
 
తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న 'సోని లివ్' తన తొలి చిత్రంగా "వివాహ భోజనంబు" ను ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అయిన "వివాహ భోజనంబు" సినిమా ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందని  'సోని లివ్' ఆశిస్తోంది. లాక్ డౌన్ లో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే ఓ పిసినారి పెళ్లి కొడుకు ఎలా ఇబ్బందులు పడ్డాడో ఆద్యంతం నవ్వించేలా "వివాహ భోజనంబు" సినిమాలో చూపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ బోలెడన్ని నవ్వులు పంచింది. ఇక సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ అవడం ఖాయమని తెలుస్తోంది. 
 
సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అనివీ, సినిమాటోగ్రఫీ - మణికందన్, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - సతీష్, విజయ్, కథ - భాను భోగవరపు, మాటలు - నందు ఆర్ కె, సాహిత్యం - కిట్టు, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం, శివ చెర్రి, నిర్మాతలు - కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం - రామ్ అబ్బరాజు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నెట్' టీజర్ విడుదల - అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు?(Video)