సోమవారంనాడు మంగళగిరిలో ఓటు హక్కును పలువురు ప్రముఖులు వినియోగించుకున్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి : 7:30 ని.లకు జూబ్లీహిల్స్ క్లబ్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎన్.టి.ఆర్., మోహన్ బాబు కుటుంబంతోపాటు సినీ రంగం ప్రముఖులు హైదరాబాద్ లో ఓటు హక్కును వేశారు.
Rama and Rajamouli
ఇక ఎ.పి.లో పిఠాపురం నుంచి ఎం.ఎల్.ఎ. గా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్ కు అక్కడ ఓటు లేదు. మంగళగిరిలో వుండంతో ఆయన ఈరోజు తన భార్యతో ఓటు వినియోగించుకున్నారు. మంగళగిరి లక్మీనరసింహ స్వామి కాలనీలో ఆయన ఓటు వేశారు. పవన్ తన భార్య అన్నా లెజ్నెవా తో కలిసి వోట్ వేశారు.
అలాగే నాగచైతన్యతోపాటు పలువురు యంగ్ హీరోలు కూడా ఓటు వేశారు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి కూడా హైదరాబాద్ లో ఓటు వినియోగించుకున్నారు. దుబాయ్ లో ఉన్న ఎస్ ఎస్ రాజమౌళి ఓటు వేసేందుకు డైరెక్ట్ గా విమానాశ్రయం నుండి పోలింగ్ బూత్ కి వెళ్లారు. తను ఓటు వేసిన విషయాన్ని వెల్లడించడానికి ఫోటోను షేర్ చేశారు. తాజాగా ఆయన మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు.