Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Advertiesment
revanth football

ఠాగూర్

, ఆదివారం, 12 మే 2024 (15:49 IST)
తెలంగాణా రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే, పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం పోలింగ్‌ ముందు రోజు చేసుకోవాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైవున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఆదివారం ఉదయం యూనివర్శిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి చలాకీగా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఆయనతో కలిసి పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మైదానంలో దిగారు.
 
ఫుట్‌బాల్ ఆడుతుండగా ఒక దశలో షూ పాడైపోయింది. అయినప్పటికీ ఆయన దాన్ని తీసేసి ఒట్టి కాళ్లతోనే మైదానంలో నలువైపులా పరుగెత్తుతూ ఫుట్‌బాల్ ఆడారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్‌సీయూ ఎన్.ఎస్.యూ.ఐ విభాగం, హెచ్.సి.యు. విద్యార్థులు కూడా ఈ క్రీడలో పాలుపంచుకున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీశాట్ ఈఈవో వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది : కేంజ్రీవాల్