Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

vijayawada central assembly constituency: కసితో ఓట్లు వేస్తున్న ఓటర్లు, ఏ పార్టీని పరుగెత్తిస్తారో?

Voters long que at vijayawada central assembly constituency polling booths

ఐవీఆర్

, సోమవారం, 13 మే 2024 (10:44 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. vijayawada central assembly constituency నియోజకవర్గం పరిధిలో ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు బారులు తీరి కనిపించారు. ఎక్కడ చూసినా పెద్దపెద్ద క్యూలైన్లు కనబడుతున్నాయి. ఇంత భారీగా ఓటర్లు ఉదయాన్నే ఓటింగ్ కేంద్రాల ముందు నిలబడటం చూస్తుంటే ఏదో పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితి వున్నట్లు అర్థమవుతుంది. కసితో ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీసం మంచినీళ్లు అందించే సౌకర్యాలు కూడా కనిపించడంలేదు.
 
ఎండలో అలాగే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. కొన్నిచోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మరోవైపు సెలబ్రిటీలు అందరూ ఉదయమే వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
webdunia
తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్, బారులు తీరిన యూత్
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రక్రియలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆరు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్లా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది.
 
ఈ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ ముగింపు సమయానికి పోలింగ్‌ కేంద్రం లోపల క్యూలైన్‌లో ఉన్నవారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లువుండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది, మహిళలు 2,10,58,615 మంది, ఇతరులు 3,421 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో అత్యంత సమస్యాత్మకమైనవి 12,438. వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్న పోలింగ్‌ కేంద్రాలు 34,651 (74.70 శాతం).
 
webdunia
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్‌ కేంద్రాలు పెట్టారు. ఈ దఫా మారుమూల తండాలు, గిరిజన గూడేల్లోనూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
 
అదేవిధంగా దేశంలో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌లలో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, జార్ఖండ్‌‌లో 4 చొప్పున, జమ్ముకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ కొనసాగుతోంది. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌లో జరుగుతున్న పెద్దఎన్నిక ఇదే. 543 స్థానాలకు గానూ ఇంతవరకు మూడు దశల్లో 283 సీట్లకు పోలింగ్‌ పూర్తయింది. నాలుగోదశతో అది 379కి చేరుతుంది.
 
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా, పుంగనూరు పరిధిలోని మూడు పోలింగ్ కేంద్రాల టీడీపీ ఏజెంట్లను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. సదుం మండలం బూరుగమందలో 188, 189, 190 కేంద్రాల టీడీపీ ఏజెంట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న సమయంలో, టీడీపీ ఏజెంట్లు రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర‌లను అపహరించారు. దీనిపై టీడీపీ నేతలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు : ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్