Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త.. ఏంటదో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (12:17 IST)
Ayyappanum Koshiyum
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. అయ్యపనమ్ కోషియం అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. 
 
ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 
 
మొదటగా ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ, రవితేజలు నటించనున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఆ చిత్ర రీమేక్ హక్కులు కొన్న ప్రొడక్షన్ హౌజ్ మాత్రం వాటిని ఇంకా ధృవీకరించలేదు. 
pawan - trivikram
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సన్నిహితులు కావడంతో, ఈ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వినబడుతున్నాయి. అదే నిజమైతే, మల్టీస్టారర్ అయిన ఈ సినిమాలో అతనితో పాటు ఇంకా ఎవరెవరు నటిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments