Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేరొకరికి భార్యగా ఉండటం మీ అసలైన గుర్తింపు కాదు.. రేణూ దేశాయ్

Advertiesment
వేరొకరికి భార్యగా ఉండటం మీ అసలైన గుర్తింపు కాదు.. రేణూ దేశాయ్
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:00 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసింది. స్త్రీవాదం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా తన మనసులోని భావాలను తెలియజేస్తూ ఒక మహిళ శక్తి ఎలాంటిది? సమాజంలో మహిళ స్థానం ఏంటి? అనే దానిపై విశ్లేషించింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 
 
ఈ క్రమంలోనే తాజాగా ఆలోచనలు రేకెత్తించే ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది రేణు దేశాయ్. ఈ సమాజంలో ఎంతోమంది దృష్టిలో నేను ఒంటరి మహిళను, సింగిల్ పేరెంట్‌ని. అందరిలాంటి ఆడదాన్ని కాదు. పురుషుల ప్రపంచంలో తాను అనుకున్నట్లుగా, తన నిబంధనలపై జీవించే స్త్రీని. భర్త మద్దతు లేకుండా తన పిల్లలను సంపూర్ణంగా పెంచుకునే తల్లిని.
 
తన కాళ్లపై తాను నిలబడి, వ్యాపారం చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే సామర్థ్యం ఉన్న మహిళని. అలాగే అన్యాయాలను గట్టిగా ఎదిరించే ఆడదాన్ని. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని ఓ స్త్రీని. స్వతంత్ర్య ఆలోచనలతో బ్రతకాలని, నన్ను అనుసరించే యంగ్ గర్ల్స్ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.
 
మీకంటూ ఓ ప్రత్యేక దృక్పథం కలిగి ఉండటం మంచిదే. వేరొకరి కుమార్తెగా లేదా భార్యగా ఉండటం మీ అసలైన గుర్తింపు కాదు. మీ లైఫ్‌లో మీరే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అలాగని సాంప్రదాయ విలువలను అగౌరవపర్చడం స్త్రీ వాదం కాదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీ వాదం. ఇకనైనా మీ మీ బలాలు, వ్యక్తిగత సామర్థ్యాలను నమ్మడం ప్రారంభించండి అంటూ పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్‌ రికార్డ్‌ను చిరు క్రాస్ చేస్తారా..?