Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ యాసలో వకీల్ సాబ్.. పవర్ స్టార్ పాట కూడా పాడతారట!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:02 IST)
Pawan kalyan
'వకీల్ సాబ్' విజయం తర్వాత పవర్ స్టార్ ''అయ్యప్పునుమ్ కోషియుమ్" రీమేక్‌లో పవన్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడంటే ఐసోలేషన్‌లో ఉండి కాస్త షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది కానీ లేదంటే కొన్ని రోజులుగా పగలు, రాత్రి షూటింగ్ చేస్తున్నాడు పవర్ స్టార్. ఓ వైపు క్రిష్ హరిహర వీరమల్లుతో పాటు మరోవైపు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి.
 
ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాలో తెలంగాణ యాసలో మెప్పించాడు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ డైలాగులకు ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయారు. సూపర్ ఉమెన్ అంటూ సెకండాఫ్ వచ్చే డైలాగ్స్‌కు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. మరోవైపు ఇప్పుడు తెరకెక్కుతున్న అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లో పవన్ సీమ బిడ్డగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రాయలసీమ ప్రాంత వాసిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు .
 
పింక్ రీమేక్ వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఈ రీమేక్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇందులో పవన్ రాయలసీమ యాసలో మాట్లాడతారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ డిక్షన్ కోసం ప్రముఖ రైటర్ పెంచల్ దాస్ దగ్గర శిక్షణ కూడా తీసుకుంటున్నాడు పవర్ స్టార్. ఈ రీమేక్‌లో పవన్ ఒక పాట కూడ పాడనున్నాడు. 
 
ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా ఖరారు చేశాడు. ఈ సినిమాకు పవన్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. షూటింగ్ ఇప్పటికే 50 శాతం వరకు పూర్తైంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

పిఠాపురంలో పవన్‌కు కలిసొచ్చే ఆ సెంటిమెంట్?

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments