తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బండ్ల గణేశ్ భక్తుడు ఆయన కొలిచే దేవుడు హీరో పవన్ కళ్యాణ్. ఇది బహిరంగ రహస్యం. ప్రస్తుతం వీరిద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు.
దీనికి కారణం లేకపోలేదు.. తన కార్యాలయంలో పని చేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో పవన్ కళ్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో ఉంటున్నారు.
అలాగే, నిర్మాత బండ్ల గణేశ్‌లో మరోమారు కరోనా లక్షణాలు బయపటినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ ఆస్పత్రిలో చేరి ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ సెకండ్ వేవ్‌లో పాజిటివ్‌కి గురయ్యారు. ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలు కరోనాతో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. సెకండ్ వేవ్ పరిస్థితులను చూస్తున్న ప్రభుత్వాలు కూడా కఠినంగా కొన్ని రూల్స్ పాస్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
మరోసారి లాక్డౌన్ అనేలా వార్తలు వచ్చినా.. ప్రభుత్వాలు ఆర్థికంగా దెబ్బతింటాయని భావిస్తూ.. లాక్డౌన్ సాహసం చేయడం లేదు. కానీ, ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా ఫస్ట్ వేవ్‌లో టాలీవుడ్ తరపు నుంచి ఫస్ట్ కరోనా పాజిటివ్‌కి గురైన వ్యక్తిగా అప్పట్లో బండ్ల గణేష్ పేరు వినిపించింది. ఇటీవల 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాక్టివ్‌గా కనిపించిన బండ్ల గణేష్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
జ్వరంతో పాటు కోవిడ్‌కి చెందిన మరికొన్ని లక్షణాలతో ఆయన తీవ్రంగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం.
అయితే అధికారికంగా మాత్రం బండ్ల గణేష్ ఫ్యామిలీ సభ్యులెవరూ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. బండ్ల గణేష్ దేవుడుగా కొలిచే.. ఆయన దేవుడు పవన్ కల్యాణ్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.