Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నుండి ‘విజయం’ పాట విడుదల

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:29 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. తనను తాను ఆంధ్ర ప్రదేశ్ ఆడపడుచుల అన్నగా అభివర్ణించుకునే నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుండీ... అందరూ గౌరవంగా అన్నగారూ అని పిలుచుకునే స్థాయి నుండి ఆయనపై చెప్పులు వేసే స్థాయి వరకు సాగిన ఆయన పతనానికి సంబంధించిన కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ కథను తెరకెక్కించడం జరిగింది.
 
కాగా... ఈ చిత్రం నుండి ‘విజయం విజయం ఘన విజయం.. విజయం విజయం శుభ సమయం’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. సిరాశ్రీ వ్రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మోహన భోగరాజులు ఈ పాటను ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments