''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విజయం ప్రోమో.. రామారావు గారు పెళ్లి చేసుకోవాలని అడిగారు.. (వీడియో)

బుధవారం, 20 మార్చి 2019 (10:24 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మూవీ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విజయం పాట ప్రోమో విడుదలైంది. బుధవారం వర్మ 'విజయం విజయం ఘన విజయం... విజయం విజయం శుభసమయం... జయహో నాదం.. ఎదలో మోదం.. వదనాల వెలిగే హాసం... గుండెల్లో లోలోపల ఆనందం...' అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విడుదల చేశారు. 
 
ఈ పాట 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, ఎన్టీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే క్రమంలో వస్తుందని తెలుస్తోంది. "నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు.
 
వాళ్లందరికీ ఈ ఘనవిజయం ఓ గొప్ప చెంపదెబ్బ" అన్న ఎన్టీఆర్ డైలాగ్ కూడా వినిపిస్తోంది. ఇంకా దాన్ని ఆపాలని నేనే చేసే ప్రయత్నానికి నాకు వందశాతం సపోర్ట్ కావాలంటూ చంద్రబాబు పాత్రధారి చేసే కామెంట్స్, రామారావు గారు.. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అడిగారంటూ.. లక్ష్మీపార్వతి చెప్పే డైలాగ్ ఈ ప్రోమోలో కనిపిస్తాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్.. బ్యాచిలర్ లైఫ్‌కు 'సాహో' భామ స్వస్తి