Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని 'శ్యామ్ సింగ రాయ్' కోల్‌క‌తా షెడ్యూల్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (16:56 IST)
Nani, kritisetty, Saipallavi
నాని హీరోగా, రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం 'శ్యామ్ సింగ రాయ్‌'. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.  
 
ఈ సినిమా తాజా షెడ్యూల్ కోల్‌క‌తాలో ప్రారంభ‌మైంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లు స‌హా ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటుండ‌గా, ప‌లు కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.
 
నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చ‌గా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' ఓ మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందుతోంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments