Upeena, kritisetty, Vyshnav tej
చిత్రం: ఉప్పెన, తారాగణం: వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి, సాయిచంద్త, మహేష్‌కుమార్ తదితరులు, సాంకేతికతః ఛాయాగ్రహణం: షందత్, సంగీతంః దేవీశ్రీప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్, సుకుమార్ , రచన, దర్శకత్వం: బుచ్చి బాబు
మెగాస్టార్ అనే వటవృక్షంలో మరో కొమ్మగా వచ్చిన నటుడే వైష్ణవ్ తేజ్. సాయిధరమ్‌తేజ్ సోదరుడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తొలిసారి దర్శకుడిగా పరియమైన సినిమా ఉప్పెన`. దేవీ సంగీతం, `నీ కళ్లు నీలి సముద్రం.` వంటి పాట హిట్ కావడంతో సినిమాపై ఆసక్తి పెంచింది. అందుకు ప్రచారం కూడా మరింత తోడయింది.
మట్టివాసన కథలు, మరో రంగస్థలం వంటిదని, కథనం గురించి ఈతరం దర్శకులు మరీ మరీ చూడాల్సిన సినిమా అని రకరకాల పబ్లిసిటీతో సినిమా హైరేంజ్‌కు తీసుకెళ్ళారు. ఇక నాయిక కృతి శెట్టి తెలుగు సినిమాకు దొరికిన అద్భుతనమైన నటి అనికూడా కితాబువచ్చేసింది. అగ్ర సంస్థలో నిర్మించిన సినిమా కాబట్టి మరింత క్రేజ్ వచ్చింది. అయితే సినిమా ఆ స్థాయికి చేరుకుందా లేదా? చూద్దాం.
కథః
కాకినాడ సముద్రతీరం. జాలరుల పేట. అందులో జాలరి జాలయ్య (సాయిచంద్) కొడుకు ఆసి (వైష్ణవ్‌తేజ్). స్కూల్ చదివేరోజుల్లోనే ఊరిపెద్ద రాయాణం (విజయ్ సేతుపతి) కుమార్తె జేజమ్మ (కృతిశెట్టి) అంటే ఆసికి ఇష్టం. జేజమ్మ కాలేజీకి వెళుతుంది. తను మాత్రం జాలరివృత్తినే చేస్తుంటాడు. అలాంటి ఇద్దరికి ప్రేమ చిగురిస్తుంది.
ఇంటిలోవారికి తెలిసేలోపల ఇద్దరూ ఒకటయిపోతారు. ఇంకేముంది పరువు, కులం, పట్టింపు గల రాయాణం, ఆసిని హత్య చేయకుండానే హత్యచేసినంత పనిచేస్తాడు. ఇది చూసిన జాలయ్య షాక్‌కు గురయి తన కొడుకు కళ్ళముందే చనిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలవల్ల ఆసి, జేజమ్మ పారిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎటువంటి ముగింపు దర్శకుడు ఇచ్చాడు అనేది సినిమా.
విశ్లేషణః
ఈ కథ చాలా సినిమాలను గుర్తుచేస్తుంది. నువ్వే నువ్వే, కలర్‌ఫొటో, దొరసాని.. ఇలా చాలా చిత్రాలు స్పురిస్తాయి. పరువు హత్య కథ కనుక చాలామటుకు పోలికలు కన్పిస్తాయి. నేపథ్యం జాలరుల జీవితాలు. ఇక ఇందులో నటించిన విజయ్‌సేతుపతికి పెద్దగా నటించే అవకాశంలేదు. ఆహార్యం నిండుగా వుండడం, సీరియస్‌గా చూడడం, సిగరెట్లు తాగడం వంటి బిల్డప్ షాట్స్ పైనే దర్శకుడు శ్రద్ధతీసుకున్నాడు. తమిళ నేటివిటీకూడా సింక్ అయ్యేట్లుగా కథ వుంది.
కృతిశెట్టి బాగానే నటించింది. పతాకసన్నివేశంలో ఆమె ఏకధాటిగా తండ్రికి జ్జానోదంయ అయ్యేట్లు డైలాగ్‌లు చెప్పడం సినిమాకు హైలైట్. ఇంకోవైపు ఆసిని మానసికంగా చంపేయడం అనేది కొత్త పాయింట్. ఈ రెండు మినహా మిగిలినకథంతా సేమ్‌టు సేమ్. ఈ సినిమా ఫైనల్‌గా లేడీఓరియెంటేడ్ సినిమాగా మారిపోయింది.
మొదటి భాగంలో హీరో, హీరోయిన్లకు ప్రాధాన్యత వుంది. ద్వితీయార్థంలో మొత్తం నాయిక మీద ముగింపు వస్తుంది. ఆమె సినిమాను నిలబెట్టింది. ఇక హీరోగా వైష్ణవ్‌తేజ్ నటుడిగా పర్వాలేదనిపిస్తాడు. ఆహార్యంలో తన అన్నయ్యను గుర్తుచేస్తాడు. మిగిలిన పాత్రలు పరిధిమేరకు నటించాయి. సాంకేతికంగా కథనంలోనే రొమాన్స్, హాస్యం, యాక్షన్ అన్నింటిని దర్శకుడు కూర్చాడు. సంభాషణలుకూడా సినిమాటిక్‌గానే రాసుకున్నాడు. సముద్రానికి హద్దు వుంటుంది. కానీ ఉప్పెనకు వుండదు. ప్రేమకూడా అంతే. అంటూ ముగింపులో సుకుమార్ చెప్పిన డైలాగ్‌లే టైటిల్‌కు అర్థం.
సినిమా అంటే ఈ లెక్కలుండాలి. ఇన్ని హెచ్చవేతలు, తీసివేతలు వుండాలి. చూసుకుని మరీ కథ రాసుకున్నాడు దర్శకుడు. సెకండాఫ్‌లో ఒరిస్సా, కొల్‌కత్తా, సిక్కింకు యువ జంట పారిపోతారు. అదంతా ప్రేక్షకుడికి పరీక్షే. కథను ఎటువైపు తీసుకెళ్ళాలో తెలీక కూర్చినట్లుంది. ఇక్కడ రంగస్థలంతో ఎందుకు పోల్చారంటే.. ఇందులో హీరోకు `గ` అనే అక్షరం పలకదు. తంటాలు పడుతుంటాడు. అలాగే సైకిల్‌పై యాక్షన్ సన్నివేశాలు కూడా డిటోనే.
ఎంత పెద్ద లెక్కలు మాస్టారు అయినా కథలో వున్న తెలివితేటలు తెరమీదకు వచ్చేసరికి తప్పటడుగులు పడతాయి. ఇందులో అదే జరిగింది. సినిమా బయటకు వచ్చింది కాబట్టి.. చెప్పకతప్పదు. మగతనం అనేది మనిషిలో కింద వుండేదికాదు. అతను పక్కన వుంటే చాలు కొండంత ధైర్యంతో మహిళకు అనిపించాలి. మగతనం అనేది అణువణువుగా వుండాలనే పాయింట్‌ను దర్శకుడు చెప్పాడు. దీనిమీదే క్లయిమాక్స్‌లో డైలాగ్‌లు. కూతురు తండ్రికి మధ్య వుంటాయి. అవి కన్నీళ్ళు తెప్పించేతగా లేకపోయినా ఎమోషన్‌ను కేరీ చేయగలిగింది. సో. కథలో ఇచ్చిన ముగింపు తరహా జీవితాలు సమాజంలో చాలానే వున్నాయి. ఈ సినిమా వారికి అంకితం ఇవ్వవచ్చు.