Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి సినిమాలోనూ కృతిశెట్టి న‌టిస్తుందా?

Advertiesment
చిరంజీవి సినిమాలోనూ కృతిశెట్టి న‌టిస్తుందా?
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (17:32 IST)
Kriti setty, Uppena, offers
చాలామంది హీరోయిన్లు కొత్త‌గా వ‌స్తుంటారు. కొత్త‌లో వారికి అవ‌కాశాలు రావాలంటే సినిమా హిట్ కావాలి. కానీ ఇందుకు భిన్నంగా `ఉప్పెన‌` న‌టి కృతిశెట్టి వుంది. ఆమె చిరంజీవి మేన‌ల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ఉప్పెన‌లో న‌టించింది. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుక‌లో మెగాస్లార్ చిరంజీవి తెగ పొగిడేశాడు కృతిశెట్టిన‌.

ఈ సినిమా త‌ర్వాత ఆమె డేట్స్ దొర‌క‌వ‌ని చ‌లోక్తులు విసిరారు. అది స‌ర‌దాగా అనుకుంటే పొర‌పాటే. ఆమెకు నిజంగానే అవ‌కాశాలు ఉప్పెన వ‌చ్చాయ‌నే చెప్పాలి. ఇటీవ‌లే వైష్ణ‌వ్ తేజ్ కూడా ఆమె న‌ట‌న‌, డెడికేష‌న్ గురించి గొప్ప‌గా చెప్పాడు. తెలుగు రాక‌పోయినా షూటింగ్‌లోనే చాలా త్వ‌ర‌గా నేర్చేసుకుంది అన్నాడు.

ఈమ‌ధ్య తెలుగు ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు ఎక్కువ‌గా భాష నేర్చుకుంటే వారి పారితోషికం కూడా పెరిగిపోతుంద‌ట‌. ఏదిఏమైనా తెలుగు వారికి మ‌రో హీరోయిన్ ద‌క్కింది.  అందుకే మెగాస్టార్‌ చిరంజీవి అయితే ఏకంగా ‘దర్శకనిర్మాతలు ఇప్పుడే ఈ అమ్మాయి డేట్‌లను బుక్‌ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో దొరక్కపోవచ్చు’ అని వేదిక మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దానికి బ‌లం చేకూరుస్తూ కృతి శెట్టి అవ‌కాశాలను వెల్ల‌డించింది.

నాని, సుధీర్‌బాబు సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇక‌ నాగశౌర్య చిత్రంలోనూ ఈమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అంతేకాదు తాజాగా అక్కినేని అఖిల్‌, సురేందర్‌ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కించబోయే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లో ఛాన్స్ కొట్టేసింది. మ‌రి చిరంజీవి కితాబంటే మామూలా మ‌రి. పాత్ర కుదిరితే చిరంజీవి సినిమాలో కూడా ఏదో ఒక రోల్‌లో పెడ‌తాడేమోన‌ని ఫిలింన‌గ‌ర్‌లో టాక్ వినిపిస్తోంది. బ‌హుశా అందుకేనేమో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ముందుగా  సూచ‌న చేశాడ‌ని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నప్పటి నుంచి ఆ వ్యాధి వల్ల ఇబ్బంది పడ్డాను: కాజల్ అగర్వాల్