పేపర్‌‌తో గొంతుకోయొచ్చని తెలుసా?... దేవదాస్ డిలీటెడ్ సీన్ (Video)

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". గత శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నిడివి కారణంగా కొన్ని సీన్

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (13:04 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". గత శుక్రవారం విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతంచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నిడివి కారణంగా కొన్ని సీన్లను డిలీట్ చేశారు. వీటిలో ఒకదాన్ని హీరో నాని ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.
 
కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించగా, రావురమేశ్‌తో వాదనకు దిగే సీన్ ఇది. మాఫియా డాన్ 'దేవ'కు చికిత్స చేసిన తర్వాత, తనను తిరిగి డాక్టరుగా చేర్చుకోవాలని కోరేందుకు వచ్చిన వేళ ఈ సీన్ ఉంది. నాని వృత్తిని, అర్హతను కించపరుస్తూ మాట్లాడగా, ఆగ్రహంతో నాని మాట్లాడే మాటలు ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి. 
 
'నేను బయట ఎన్ని కేసులు డీల్‌ చేశానో తెలుసా?' అంటూ ప్రారంభమయ్యే నానీ డైలాగుల్లో, పేపర్‌‌తో గొంతుకోయొచ్చని తెలుసా? ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా? అంటూ ఉద్వేగంతో చెప్పిన డైలాగులు హైలైట్‌గా ఉన్నాయి. నిడివి ఎక్కువైన కారణంగానే ఈ సీన్‌ను సినిమాలో చేర్చలేదని సమాచారం. ఆ సీన్‌ను ఓ సారి మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments