Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవదాస్ షార్ట్ రివ్యూ... రష్మిక-ఆకాంక్ష అప్‌సెట్... నాగ్-నాని అదుర్స్

అక్కినేని నాగార్జున- నాని హీరోలుగా ఆకాంక్ష, రష్మిక హీరోయిన్లుగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం దేవదాస్. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదుర్స్ అంటున్నారు. నాగార్జున-నాని యాక్షన్ పార్ట్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయని చెపుతున్నారు. నాని-నాగార్జ

Advertiesment
Nagarjuna
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:33 IST)
అక్కినేని నాగార్జున- నాని హీరోలుగా ఆకాంక్ష, రష్మిక హీరోయిన్లుగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం దేవదాస్. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదుర్స్ అంటున్నారు. నాగార్జున-నాని యాక్షన్ పార్ట్ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయని చెపుతున్నారు. నాని-నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం వినోదాత్మకంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. 
 
ఇకపోతే ఈ చిత్రం 2 గంటల 44 నిమిషాల పాటు సాగుతుంది. నాని, నాగార్జున మధ్యనే సినిమా అంతా సాగుతుంది. హీరోయిన్ల పాత్రలు కేవలం జస్ట్ వచ్చిపోయేవిగా వుంటాయి. ఈ విషయంలో హీరోయిన్లు అప్‌సెట్ అయ్యి వుండవచ్చని వాదనలు కూడా వినబడుతున్నాయి. హీరోయినల్ పాత్రల నిడివి తక్కువగా వుంది. ముఖ్యంగా చిత్రం అంతా నాగ్-నానిలపైనే సాగుతుంది. 
 
దేవదాస్ స్టోరీ ఏంటంటే.... ఇద్దరు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. డాన్ దేవ(నాగార్జున), డాక్టర్ దాసు(నాని) ఎట్లా స్నేహితులుగా మారారన్నది తెరపై చూడాల్సిందే. స్నేహితులుగా వారు ఎదుర్కొన్న సమస్యలు ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దారు.
 
టెక్నికల్‌గా... దేవదాస్ చిత్రంలో డీసెంట్ ప్రొడక్షన్ వేల్యూస్ కనిపిస్తాయి. మణిశర్మ సంగీతం ఆకట్టుకుంటుంది. కెమేరా పనితనం బాగుంది. డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ అన్నీ చిత్రానికి హైలెట్‌గా నిలబడతాయి. మొత్తమ్మీద ఓ మంచి వినోదాత్మక చిత్రం దేవదాస్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తుంది... ముహుర్తం ఖ‌రారు..!