Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవదాస్ డైరెక్టర్ లేజీ ఫెలో... దేవ‌దాస్ ఫ‌లితాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిన నాగ్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ నెల 27న దేవ‌దాస్ ప్ర‌పంచ వ్యాప్తంగ

Advertiesment
దేవదాస్ డైరెక్టర్ లేజీ ఫెలో... దేవ‌దాస్ ఫ‌లితాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసిన నాగ్
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (13:36 IST)
కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ నెల 27న దేవ‌దాస్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సంద‌ర్భంగా దేవ‌దాస్ టీమ్ చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ... డైరెక్ట‌ర్ శ్రీరామ ఆదిత్య లేజీ ఫెలో. ఆడియో వేడుక‌లో కూడా అన్నాను.
 
ఇలా ఎందుకు అంటున్నానంటే... సినిమా రిలీజ్‌కి 3 రోజుల ముందు సినిమా చూపించాడు. రిలీజ్ డేట్‌కి నెల రోజుల ముందు ఇస్తే.. చూసుకుని బెట‌ర్మెంట్ చేసుకోవ‌డానికి టైమ్ ఉంటుంది. కానీ.. 3 రోజుల ముందు చూపిస్తే ఇక బెట‌ర్మెంట్ చేయ‌డానికి ఏం ఉంటుంది అన్నారు. నాగ్ మాట‌ల‌ను బ‌ట్టి దేవ‌దాస్ చూసిన త‌ర్వాత నాగ్‌కి కొన్ని మార్పులు చేయాల‌నిపించింద‌ని.. కానీ ఛేంజ‌స్ చేయ‌డానికి టైమ్ లేద‌ని.. అందుకే నాగ్ త‌న అసంతృప్తిని ఆవిధంగా బ‌య‌ట‌పెట్టార‌ని తెలుస్తోంది.
 
కానీ.. ఈ సినిమా మాత్రం ఫుల్ ఫ‌న్‌తో అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంద‌నే టాక్ ఉంది. నాగ్ చేయాల‌నుకున్న మార్పులు చేసుంటే ఇంకా బాగుండేది. మ‌రి.. దేవ‌దాస్ ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు న‌చ్చుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్... మరో చిత్రంలో కూడా...