Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్... "దేవదాస్" మూవీ రివ్యూ

గతకొంతకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల జోరు కొనసాగుతోంది. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అగ్ర హీరోలు యువ హీరోలతో కలిసి వెండితెరను పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ న

ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్...
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:59 IST)
నిర్మాణ సంస్థ‌: వైజ‌యంతీ మూవీస్‌.
తారాగ‌ణం: నాగార్జున అక్కినేని, నాని, అకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా, కునాల్ క‌పూర్‌, కిషోర్ వెన్నెల తదితరులు.
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌.
నిర్మాత‌: సి.అశ్వినీద‌త్‌.
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఆదిత్య‌.
విడుదల తేదీ : సెప్టెంబరు 27వ తేదీ గురువారం. 
 
గతకొంతకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల జోరు కొనసాగుతోంది. మున్ముందు కూడా ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అగ్ర హీరోలు యువ హీరోలతో కలిసి వెండితెరను పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునలాంటి స్టార్‌ హీరో నానితో కలిసి చేసిన చిత్రమే "దేవదాస్". ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ సొంత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పాత చిత్రాలు "గుండమ్మకథ"లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల కెమిస్ట్రీ ఎలా ఆకట్టుకుంటుందో అదే స్థాయిలో "దేవదాస్" కూడా అలరిస్తుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. అందుకు తగినట్టుగానే ప్రచార చిత్రాలూ ఆకట్టుకుంటున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైన ఈ చిత్రంలో నాగ్ - నానిల కెమిస్ట్రీ ఎలా ఉందో.. ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
 
చిత్ర కథ : 
దేవ (నాగార్జున) పెద్ద డాన్‌. అత‌నెలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ అంద‌రినీ భ‌య‌పెడుతుంటాడు. దాస్ (నాని) ఓ వైద్యుడు‌. మనిషి ప్రాణాల విలువ తెలిసిన వ్య‌క్తి. త‌న నిజాయ‌తీ వ‌ల్ల ఓ కార్పొరేట్ ఆసుప‌త్రిలో ఇమ‌డ‌లేక బ‌య‌టికి వచ్చేస్తాడు. ఆ తర్వాత ధూల్‌పేట‌లోని ఓ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్‌ ఉద్యోగం లభిస్తుంది. ఓ రోజున పోలీసుల కాల్పుల్లో దేవకు బుల్లెట్ గాయాలవుతాయి. దీంతో ధూల్‌పేటలోని ఆస్పత్రిలో దేవ వచ్చి చేరుతాడు. దేవకు దాస్ చికిత్స చేస్తాడు. ఆ తర్వాత వీరిద్దరికీ ప‌రిచ‌యం ఏర్ప‌డి, అది స్నేహంగా మారుతుంది. 
 
ఇకపోతే, పూజ (ర‌ష్మిక‌)ను తొలి చూపులోనే దాస్ ప్రేమిస్తాడు. అలాగే, యాంక‌ర్ జాహ్న‌వి (ఆకాంక్ష సింగ్) అంటే దేవ‌కి చాలా ఇష్టం. ఇద్ద‌రి ఫ్రెండ్‌షిప్‌, జీవితాలూ సుఖంగా సాగుతుండ‌గా ఓ ఘ‌ట‌న జ‌రుగుతుంది. దాని వ‌ల్ల దాస్.. దేవ‌కి దూర‌మ‌వుతాడు.. అయితే వారిద్ద‌రినీ క‌లిపిన అంశాలేంటి? చివ‌రికి దేవ‌కి ఏమ‌యింది? అనేది ఆస‌క్తిక‌రం.
 
ఇద్దరు హీరోలను ఒకేసారి తెరపై చూడటం సినిమా అభిమానులకు ఓ పండగలా ఉంది. వారి నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో వాటన్నింటినీ మేళవించి పొందుపరిచిన సినిమానే 'దేవదాస్'. కథపరంగా చిత్రబృందం ప్రయోగాలేమీ చేయలేదు. మనకు తెలిసిన మామూలు కథనే ఎంచుకున్నారు. ప్రాణాపాయంలో ఉన్న ఓ డాన్‌ను అతి సాధారణమైన, నిజాయతీపరుడైన, మంచివాడైన వైద్యుడు కాపాడితే.. వారిద్దరి మధ్య ఓ స్నేహం ఏర్పడితే.. ఆ స్నేహం వారిద్దరి జీవితాల మీద ఏ విధంగా ప్రభావం చూపింది. జీవితం గురించి వీరిద్దరూ తెలుసుకున్నదేంటి? నేర్చుకున్నదేంటి? అనేదే దేవదాస్ ఫైనల్ కథ. 
 
విశ్లేష‌ణ‌
దేవాగా నాగార్జున‌కు ఈ త‌ర‌హా పాత్ర‌లు కొత్తే అయినా, న‌ట‌న కొత్త కాదు. క‌ళ్ల‌ద్దాల‌తో, గ‌డ్డం లేకుండా, మీసాల‌తో గోల్డ్ మెడ‌లిస్టుగా దాస్ పాత్ర‌లో నాని చేసిన న‌ట‌న బావుంది. నానికి అన్న‌గా సీనియ‌ర్ న‌రేష్‌, ఆయ‌న భార్య‌గా స‌త్య‌కృష్ణ‌, హాస్పిట‌ల్ ఛైర్మ‌న్‌గా ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, సీనియ‌ర్ డాక్ట‌ర్‌గా రావు ర‌మేశ్‌, సైకాల‌జిస్ట్‌గా వెన్నెల కిశోర్‌, పోలీస్ ఆఫీస‌ర్‌గా ముర‌ళీ శ‌ర్మ‌, ఇన్‌స్పెక్ట‌ర్‌గా ర‌ష్మిక‌, యాంక‌ర్‌గా ఆకాంక్ష అంద‌రూ బాగా చేశారు. పాట‌ల‌ను చాలా రిచ్‌గా తీశారు. ప్ర‌తి పాట‌కూ ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసి తీశారు. 
 
స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా బోర్ కొట్టించినా చాలా స‌న్నివేశాల‌ను క‌న్విన్సింగ్‌గా తీశారు. ముఖ్యంగా ఉత్తేజ్ హాస్పిట‌ల్ సీన్ కంట‌త‌డి పెట్టించింది. అలాగే దేవాకి, దాసుకు మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ‌, న‌వీన్‌ చంద్ర‌ను షూట్ చేసేట‌ప్పుడున్న ఛేజ్‌, చిన్న‌పిల్లాడు పిస్ట‌ల్‌తో ఆట‌ప‌ట్టించే సంద‌ర్భం.. అన్నీ బావున్నాయి. ఈ చిత్రం తొలి అర్థభాగంలో ద‌ర్శ‌కుడు దేవాకి, దాస్‌కీ మ‌ధ్య బంధాన్ని చూపించ‌డానికి, ల‌వ్ ఎపిసోడ్స్ చూపించ‌డానికి కాస్త కంగారు ప‌డినట్టుగా అనిపించింది. శ్యామ్ కెమెరా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాలి. 
 
ఇక ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ తెలిసిన ఆర్టిస్టులున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ నేచుర‌ల్‌గా న‌టించడం గమనార్హం. పాట‌ల‌ను తెర‌కెక్కించిన విధానం చాలా బాగుంది. డైలాగులు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి. ఇక మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, ఫస్టాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉన్న‌ట్ట‌నిపించింది. తొలి అర్థభాగంలో అన్ని విష‌యాల‌ను ప‌రిచ‌యం చేయ‌డం వ‌ల్ల దేనిమీదా ఫోక‌స్ పెద్ద‌గా లేన‌ట్ట‌నిపించింది. ఈగోయిస్ట్ అయిన డాక్ట‌ర్‌లో మార్పు రావ‌డానికి పెద్ద కార‌ణాలేం క‌నిపించ‌వు. యాంక‌ర్ జాహ్న‌వి ఇంట్లో డాన్ దేవాకి సంబంధించిన క్లిప్పింగ్స్ ఎందుకుంటాయో తెలియ‌వు. మొత్తంమీద నాగార్జున అభిమానులు, నాని ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి ఒకేసారి చూసేలా ఈ చిత్రం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ 'నోటా'ను విడుదల కానివ్వం... ఎవరు?