Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్: తప్పు చేశావ్ తమన్నా... అరిచిన నాగార్జున

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (12:51 IST)
నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ అందరి అంచనాలను తలకిందులు చేస్తు ట్రెమండెస్ సక్సెసుతో ముందుకు సాగుతోంది. ఐతే ఈ షోలో ఇటీవలే వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ హౌసులోకి ఎంటరైన తమన్నా సింహాద్రి రచ్చరచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తన తోటి సభ్యుడు రవికృష్ణను టార్గెట్ చేస్తూ... పప్పు... పవర్ లేని పప్పు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. 
 
ఆ మాటలకు రవికృష్ణ చాలా హర్ట్ అయ్యాడు. ఈ విషయంలో తమన్నాకు ఆడియెన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అసలు తమన్నా అడుగుపెట్టిన దగ్గర్నుంచి బిగ్ బాస్ హౌస్ అల్లకల్లోలం అయిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో శనివారం నాడు బిగ్ బాస్ హౌసులో వున్న సభ్యుల గురించి నాగార్జున మాట్లాడారు. 
 
తమన్నా... తప్పు చేశావ్... నువ్వు చెప్పిన మాటేంటి? నువ్వు చేసిందేమిటి... రవి పట్ల అలా ప్రవర్తించవచ్చా అని నాగ్ అనేసరికి ఆమె సిగ్గుతో తల దించుకుంది. ఆ తర్వాత మిగిలిన సభ్యుల వ్యవహారం గురించి కూడా చెప్పిన నాగార్జున గత వారం నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు, తమన్నాలను తమ లగేజ్ మొత్తాన్ని సర్దేసి స్టోర్ రూంలో పెట్టాలని సూచించారు. దాంతో వారందరూ అలానే చేశారు. 
 
స్టోర్ రూంలో ఎవరి లగేజ్ వుండదో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగ్. కానీ అశురెడ్డి వెళ్లి చూడగా అక్కడ ఒక్కరి లగేజ్ కూడా లేదు. మరి ఎలిమినేట్ ఎవరైనట్లు... ఆదివారం చూడాల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments