Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనసు లేని రెండో 'మన్మథుడు' ... ద్వితీయ విఘ్నం దాటలేకపోయిన రాహుల్

Advertiesment
మనసు లేని రెండో 'మన్మథుడు' ... ద్వితీయ విఘ్నం దాటలేకపోయిన రాహుల్
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (17:51 IST)
చిత్రం .. మన్మథుడు 2
తారాగణం : నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, రావూ రమేష్, లక్ష్మీ., 
సంగీతం : చైతన్‌ భరద్వాజ
నిర్మాత : నాగార్జున, పి. కిరణ్‌
దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌
 
టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున వయసు పెరుగుతున్న మరింత కుర్రోడిగా మారిపోతున్నాడు. ప్రయోగాలకు అందరికంటే ఒక అడుగు ముందుండే నాగార్జున.. తాజాగా మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేనా.. ఐ డూ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీని తెలుగులోకి రీమేక్ చేశారు. ఈ చిత్రానికి చిలసౌ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నాగార్జున మరోమారు మన్మథుడుగా అలరించే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..? రాహుల్ దర్శకుడిగా మరో విజయాన్ని అందుకున్నాడా..? లేదా అనేది పరిశీలిద్దాం. 

కథ  : 
శ్యామ్ అలియాస్ సాంబశివరావు (అక్కినేని నాగార్జున). పోర్చుగల్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో ప్రేమపై నమ్మకాన్ని కోల్పోతాడు. పైగా, ప్రేమంటే అబద్ధమని వాదిస్తుంటారు. పైగా, తన అందం కోసమే ఇకపై జీవించాలన్న నిర్ణయానికి వస్తాడు. 
 
అదేసమయంలో వయసు మీదపడుతుంటే పెళ్లి చేసుకోవాలని విసిగిస్తున్నారని కుటుంబానికి కూడా దూరంగా ఉంటుంటాడు. వయసు మీద పడటంతో శ్యామ్ తల్లి (లక్ష్మీ).. కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. కుటుంబమంతా కలిసి మూడు నెలలో పెళ్లి చేయాలని తీర్మానం చేస్తారు.
 
ఈ పెళ్లిని చెడగొట్టేందుకు మరో మార్గం లేక అవంతిక (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) అనే అమ్మాయిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు. సరిగ్గా పెళ్లి రోజున చెప్పకుండా వెళ్లిపోవాలని అవంతికతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన సమస్యల కారణంగా అవంతిక కూడా అగ్రిమెంట్‌కు అంగీకరిస్తుంది. 
 
అలా ఇంటికి వచ్చిన అవంతిక, శ్యామ్ కుటుంబ సభ్యులకు దగ్గరవుతుంది. ఆ తర్వాత అవంతిక శ్యామ్ కుటుంబాన్ని వీడిపోయిందా, లేక ప్లేబాయ్‌ లా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న శ్యామ్ మారాడా.. లేదా? అన్నదే మిగతా కథ. దీన్ని వెండితెరపై చూడాల్సిందే. 
 
నటీనటులు...  
తన వయసును అంగీకరిస్తూ చేసిన శ్యామ్ పాత్రలో నాగ్‌ సూపర్బ్ అనిపించాడు. లవర్‌ బాయ్‌లా కనిపిస్తూనే తన ఏజ్‌ను కూడా గుర్తు చేశాడు. తన మార్క్‌ రొమాంటిక్‌ సీన్స్‌లో వావ్ అనిపించిన నాగ్‌, ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. ఇప్పటికీ తాను మన్మథుడినే అంటూ ప్రూవ్‌ చేసుకున్నాడు నాగార్జున. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 
webdunia
 
ఇండిపెండెంట్‌ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది. వెన్నెల కిశోర్‌ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన రావూ రమేష్‌ తన మార్క్‌ చూపించాడు. ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దేవ దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు.
 
చిత్ర విశ్లేషణ.. 
తన తొలి చిత్రం చిలసౌతో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్.. తన రెండో చిత్రం మన్మథుడు 2కు దర్శకత్వం వహించే అవకాశాన్ని కొట్టేశాడు. అక్కినేని అభిమానులు నాగార్జునను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించాడు. నాగార్జునలోని కామెడీ యాంగిల్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేశాడు. అక్కడక్కడ మసాలా డైలాగ్స్‌ కాస్త శ్రుతిమించినట్టుగా అనిపించినా కథలో బాగానే అతికిపోయాయి. భారీ ఎమోషనల్‌ సీన్స్‌, పిండేసే సెంటిమెంట్స్‌ లేకుండా సినిమా అంతా ఓ ఫన్‌ రైడ్‌లో నడిపించాడు. 
 
ఫస్ట్‌ హాఫ్‌లో కామెడీ బాగానే వర్క్‌ అవుట్ అయినా కొన్ని బోరింగ్ సీన్స్‌ ఇబ్బంది పెడతాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ప్లస్‌ పాయింట్‌. నాగ్‌ను మన్మథుడిలా చూపించిన ఎమ్‌ సుకుమార్‌‌.. పోర్చుగల్‌ అందాలను అద్భుతంగా కెమెరాల్లో బందించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
 
ఇకపోతే, ఈ చిత్రం ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, నాగార్జున, కామెడీ, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ బాగున్నాయి. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, చిత్రం తొలి భాగం బోర్‌గా కొనసాగడం. అంటే దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ద్వితీయ విఘ్నం దాటలేకపోయాడు. మొత్తంమీద మన్మథుడు ప్రేక్షకుల మనసుల్లోనూ చోటు దక్కించుకోలేక పోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తమ జాతీయ చిత్రం 'మహానటి'... ఉత్తమ నటి కీర్తి సురేష్