నాగార్జున‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగిందా..? ఇంత‌కీ.. ఏంటా గొడ‌వ‌..?

గురువారం, 8 ఆగస్టు 2019 (16:25 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి మ‌న్మ‌థుడు. ఈ చిత్రానికి క‌థ - మాటలు త్రివిక్ర‌మ్ అందించ‌గా... విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో పంచ్‌లు ఎలా పేలాయో.. ప్రేక్ష‌కులు ఎంత‌గా ఎంజాయ్ చేసారో అంద‌రికీ తెలిసిందే. ఈ స‌క్స‌స్‌ఫుల్ మూవీ ఇంత‌టి విజ‌యాన్ని సాధించ‌డానికి త్రివిక్ర‌మ్ క‌థ - మాట‌లు కారణ‌మ‌ని అందరికీ తెలిసిందే.
 
అయితే... మ‌న్మ‌థుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో నాగార్జున‌ మాట్లాడుతూ.. మ‌న్మ‌థుడు సినిమాలో పంచ్‌లు అంత‌గా పేలాయి అంటే కార‌ణం విజ‌య్ భాస్క‌ర్ గారే అని చెప్పారు. త్రివిక్ర‌మ్ గురించి అస‌లు మాట్లాడ‌లేదు. మ‌న్మ‌థుడు క్రెడిట్ అంతా విజ‌య్ భాస్క‌ర్ గారిదే అన్నారు. దీనిని బ‌ట్టి త్రివిక్ర‌మ్‌కి నాగ్‌కి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయా..? అందువ‌ల‌నే నాగ్ ఇలా మాట్లాడారా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి.
 
ఈ వార్త‌ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. అయితే... ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాగార్జున‌ను ఇదే విష‌యం గురించి అడిగితే... త‌న‌కు మ‌న్మ‌థుడు క‌థ, డైలాగులు చెప్పింది విజ‌య్ భాస్క‌ర్ గారు అని చెప్పారు. నెక్ట్స్ క్వ‌చ్ఛ‌న్ ఏంటి అంటూ ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడ‌టం ఇష్టం లేద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసారు. సో... వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగింది అనేది మాత్రం క‌న్ఫ‌ర్మ్. అయితే.. ఏం జరిగింది అనేదే తెలియాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #Saahotrailer10thAugust... ఐదు సిటీల్లో ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యలో...