Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తార‌క్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైందా..? ఇంత‌కీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

Advertiesment
తార‌క్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైందా..? ఇంత‌కీ.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?
, బుధవారం, 7 ఆగస్టు 2019 (21:41 IST)
తార‌క్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత తార‌క్.. కె.జి.ఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా చేయ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తార‌క్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.
 
ఈ నిర్మాణ సంస్థ కూడా ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ మూవీ గురించి స్పందించ‌డం.. వ‌చ్చే సంవ‌త్స‌రం చివ‌రిలో ఉండ‌చ్చు అని చెప్ప‌డంతో ఈ ప్రాజెక్ట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నారు. అయితే... తాజాగా తార‌క్ త‌దుప‌రి చిత్రం గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో తార‌క్ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.
 
ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఇటీవ‌ల అర‌వింద స‌మేత సినిమా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్లో ఈ సినిమా స్టార్ట్ కానుందని టాక్ వినిపిస్తోంది. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క‌ నిశ్శ‌బ్ధం అప్పుడే పూర్తైందా..? ఇంత‌కీ.. రిలీజ్ ఎప్పుడు..?