Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం. ఇంత‌కీ ఏ సినిమా..?

Advertiesment
వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం. ఇంత‌కీ ఏ సినిమా..?
, సోమవారం, 5 ఆగస్టు 2019 (20:18 IST)
ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్‌ను అత్యంత నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా... అన్ని ర‌కాల జోన‌ర్స్‌లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. 
 
అందులో భాగంగానే 'ఎం.ఎల్.ఎ`, `వైఫ్ ఆఫ్ రామ్`, `గూఢ‌చారి`, `ఓ..బేబి`...ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలతో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. 
 
ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీ మామ' చిత్రాన్ని, అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో 'నిశ్శ‌బ్దం' అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది. 
 
కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ షార్ట్ ‌ఫిల్మ్స్‌ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఓ సోష‌ల్ అవేర్న‌ష్ షార్ట్‌ఫిల్మ్‌ను నిర్మిస్తోంది.
 
‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి లఘు చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ల్యాండ్ ఆఫ్ విడోస్`, `వైట్ నైట్` ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
 
డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా పేస్ బుక్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ...``డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌ాలో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగోల‌లో షూటింగ్ చేయ‌నున్నాం`` అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నానిపై శ్రీరెడ్డి బూతుపురాణం.. అమ్మో ఎన్ని మాటలు అందో?!