Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెజీనాపై అత్యాచారమా? ఇక్కడ చనిపోయింది ఎవరు? (Video)

Advertiesment
రెజీనాపై అత్యాచారమా? ఇక్కడ చనిపోయింది ఎవరు? (Video)
, సోమవారం, 5 ఆగస్టు 2019 (16:57 IST)
‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అడవి శేష్.. తాజాగా ఎవరు అనే సినిమా ద్వారా తెరపైకి వస్తున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా కనిపిస్తోంది.


వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిని ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కింది.. ఇప్పటికే ఫస్ట్ లుక్‌, టీజర్‌తో  ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. 
 
ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఒక మర్డరీ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాలో అడివి శేష్.. విక్రమ్ వాసుదేవ్ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. ఈసినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నారు. 
 
ఈ ట్రైలర్‌లో రెజీనాను అత్యాచారం చేసిన వ్యక్తిని ఆమె కాల్చి చంపిందా? హత్య వెనుక గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి. ఇంకేముంది..? ఎవరు సినిమా ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరూ పాతవారిగానే కనిపిస్తున్నారంటున్న తమన్నా