Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని ఖాతాలో 'మిస్టర్ మజ్ను' హిట్ ఖాయం : జూనియర్ ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (15:42 IST)
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రిలీజ్ ఫంక్షన్ శనివారం రాత్రి జరిగింది. ఇందులో "మిస్టర్ మజ్ను" ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. 
 
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, అఖిల్‌కు ఒక్క హిట్టు రావాలని ఎన్నోసార్లు దేవుడిని ప్రార్థించానని చెప్పాడు. ఈసారి హిట్ కొడతాడని నమ్మకంగా ఉందన్నాడు. ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు ఆరెంజ్ సినిమాను గుర్తుచేస్తున్నా.. ఈ మూవీకి.. ఆ చిత్రానికి సంబంధం లేదని ట్రేడ్ టాక్.
 
ఇకపోతే, ఈ చిత్రం ట్రైలర్ 2 నిమిషాల 8 సెకన్లు ఉండగా, హీరోయిన్ ఏది చేస్తే దాన్నే హీరో కూడా ఫాలో అవుతుంటాడు. 'నిధికి కోపం వచ్చి, నువ్వెంత ట్రై చేసినా నేను పడను అంటుంది. అఖిల్‌ థాంక్స్‌ అంటాడు. థాంక్స్‌ ఎందుకు అని నిధి అడుగుతుంది. నేను హాయిగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాను' అని అఖిల్‌ చెప్పడం ఫన్నీగా ఉంది. ఇలాంటి డైలాగులు అనేకం ఉన్నాయి. 
 
ఇకపోతే, అఖిల్‌, నిధి మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూపించారు. 'నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నా వల్ల ఒక్కరు ఏడ్చినా ఖచ్చితంగా అది నా తప్పు అవుతుంది' అని నిధితో నిఖిల్ అంటున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments