Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ట‌ర్ మ‌జ్ను వ‌చ్చేది ఎప్పుడు..?

Advertiesment
మిస్ట‌ర్ మ‌జ్ను వ‌చ్చేది ఎప్పుడు..?
, శుక్రవారం, 9 నవంబరు 2018 (19:35 IST)
అక్కినేని అఖిల్ న‌టించిన ఫ‌స్ట్ మూవీ అఖిల్, రెండో చిత్రం హ‌లో. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్ధాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో మూడ‌వ సినిమాగా చేస్తోన్న మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా పై అఖిల్ తో పాటు అభిమానులు కూడా చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ...డిసెంబ‌ర్ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాన్ని జ‌న‌వ‌రికి పోస్ట్ పోన్ చేసారు.
 
అయితే.. జ‌న‌వ‌రి మూడో వారంలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ 2 జ‌న‌వ‌రి మూడో వారంలో రిలీజ్ అని ఎనౌన్స్ చేయ‌డంతో మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ 2 ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలియ‌డంతో మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాన్ని జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. అయితే.. పండ‌గ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను రిలీజ్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది కానీ.. పండ‌గ కంటే ముందుగానే రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అదీ.. సంగ‌తి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌హేష్ బాబు పైన ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!