ఎక్స్‌పోజింగ్ చేసినా దారితప్పను.. అందుకే ఎంకరేజ్ చేస్తున్నారు: నిధి అగర్వాల్

ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:33 IST)
నిధి అగర్వాల్. అక్కినేని నాగచైతన్య నటించిన "సవ్యసాచి" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రం ఆమెను తీవ్ర నిరాశకు లోనుచేసింది. మంచి అందంతో పాటు కుందనపు బొమ్మలా ఉండే నిధి అగర్వాల్ తన సినీ రంగ ప్రవేశ నేపథ్యాన్ని వివరించింది. 
 
నిజానికి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మా ఇంట్లో ఎవరూ లేరు. ఓ విధంగా చెప్పాలంటే అసలు ఈ రంగం గురించి వారికి ఏమాత్రం అవగాహన లేదనే చెప్పొచ్చు. కానీ, నేను మాత్రం నా బాల్యం నుంచి సినిమాల్లో నటిస్తానంటూ అమ్మతో చెప్తూ ఉండేదాన్ని. ఆ మాటలు విని వారు నవ్వుకునేవారు. కానీ, నేను మాత్రం ఆ మాటలను సీరియస్‌గా తీసుకునేదాన్ని. 
 
చివరకు తన విద్యాభ్యాసం పూర్తికాగానే సినీ ఆర్టిస్ట్ అవుతానని సీరియస్‌గా ఇంట్లో చెప్పాను. తన ముఖకవళికలను చూసిన ఇంట్లోనివారు... దీనికి ఎందుకు అంత డ్రామా క్రియేట్ చేయనక్కర్లేదు. నీకు ఏ రంగం ఇష్టమైతే ఆ రంగంలో స్థిరపడు అని సమాధానమిచ్చారు. అలా నేను చిత్ర రంగంలోకి అడుగుపెట్టేందుకు నన్ను ప్రోత్సహించారు. పైగా తనపై వారికి గట్టి నమ్మకం ఉంది. ఎక్స్‌పోజింగ్ చేసినా దారితప్పననే నమ్మకం వారికి ఉందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హాన్సిక చిత్రం ఫస్ట్ లుక్ అదుర్స్