Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌జ‌నీ.. ఆ న‌వ్వులో ఉన్న‌ మ‌ర్మం ఏమిటో..?

Advertiesment
ర‌జ‌నీ.. ఆ న‌వ్వులో ఉన్న‌ మ‌ర్మం ఏమిటో..?
, బుధవారం, 28 నవంబరు 2018 (13:56 IST)
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన తాజా సంచ‌ల‌నం 2.0. రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంపై ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎదురుచూసారు. చాలాసార్లు ఈ సినిమా వాయిదా ప‌డింది. కానీ... క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. పైగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ సంద‌ర్భంగా 2.0 టీమ్ హైద‌రాబాదు మీడియా మీట్లో ర‌జనీకాంత్ మాట్లాడుతూ... ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ.. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోన్న ఎన్.వి.ప్ర‌సాద్ గారు ప్ర‌మోష‌న్ చేస్తున్నారు అని చెప్పారు. సినిమాలు చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు. నెక్ట్స్ ఏంటి..? పాలిటిక్సా అని జ‌ర్న‌లిస్ట్ అడిగితే.. స్పిరిట్యూవాలిటీ అన్నారు. మ‌రి.. పాలిటిక్స్ అంటే... త‌న‌దైన స్టైల్‌లో ఓ న‌వ్వు న‌వ్వి ఊరుకున్నారు. మ‌రి.. ర‌జ‌నీ న‌వ్వులో ఉన్న‌ మ‌ర్మం ఏమిటో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైరెక్టర్‌కి కథ వినిపించిన అల్లు అర్జున్... ప్లాన్ అదిరింది..!