Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (15:26 IST)
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్‌లో తెగ చర్చ సాగుతోంది. దీంతో మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. తన తదుపరి చిత్రం "ది భూత్నీ" సినిమా ఈవెంట్‌లో ఆమె పాల్గొన్న నాటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారని, దాంతో ముఖ కవళికలు కూడా మారిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెట్టింట తనపై సాగుతున్న ప్రచారంపై మౌనీ రాయ్ స్పందించారు. 
 
"నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఇతరులను ట్రోల్ చేస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం. ఎవరికి నచ్చినట్టు వాళ్లని ఉండనివ్వండి" అంటూ వేదాంత ధోరణితో మాట్లాడారు. 
 
కాగా, సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన సినిమాల్లోకి అడుగుపెట్టారు మౌనీ రాయ్... "నాగిని" సీరియల్‌తో అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ నటించిన "గోల్డ్" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ప్రస్తుంత ఆమె "ది భూత్నీ"లో నటిస్తున్నారు. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ మూవీ ఏప్రిల్ 18న విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments