ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మరోసారి వైకాపా నేతలు విరుచుకుపడుతున్నారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్ కేతిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక పాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "నేను ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదు. ఆయన ఎక్కడ పుట్టారో, ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆయన బాపట్లలో పుట్టానని, మరోరోజు గుంటూరులో పుట్టానని చెప్పారు.
ఆయన చదువు విషయంలో కూడా అంతే. ఇంటర్మీడియట్‌లో ఆయన తన ధోరణులను మార్చుకుంటూ ఉంటారు. ఇంత నమ్మదగని వ్యక్తి రాజకీయాల్లో సందర్భోచితంగా ఉండటం వింతగా ఉంది. ప్రజలు ఇప్పటికీ ఆయనను ఎలా ఇష్టపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకా పవన్‌ను కేతిరెడ్డి తింగరి అంటూ ఫైర్ అయ్యారు. అయితే కేతిరెడ్డి వ్యాఖ్యలపై జనసేన ఫైర్ అవుతుంది. పవన్‌పై వ్యక్తిగతంగా విమర్శించే ధోరణిని వైకాపా వీడట్లేదని వారు మండిపడుతున్నారు.